9.6.25

Akhil Zainab Reception Stills



























 

గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం Gaja Vahanam

















తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారు గ‌జ వాహ‌నంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష‌ సేవలు అందిస్తోంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి , పలువురు అధికారులు , శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు.

8.6.25

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం Surya Prabha Vahanam



















తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.
అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు సతీసమేతంగా గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య డెప్యూటి ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి Pedda Sesha Vahanam









అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శనివారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.
వాహన సేవలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు , శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Govindaraja Atop Hanumatha Vahanam







Atop Hanumanta Vahanam, Sri Govindaraja Swamy took out a celestial ride on Saturday morning to bless His devotees along four mada streets in Tirupati.


The sixth morning witnessed the Utsava deity on the Hanumanta Vahanam.

Both the Tirumala Pontiffs, DyEO Smt Shanti and others were present.

శ్రీ గోవిందరాజస్వామి స్వామి వారికి శ్రీవారి నగలు గరుడ సేవకు కానుకగా సుమారు రూ.34.46 లక్షల విలువైన శ్రీవారి ఆభరణాలు govindaraja swamy




తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం గరుడసేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా సుమారు రూ.34.46 లక్షల విలువైన మూడు ఆభరణాలు టిటిడి సమర్పించింది.

తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీవారు దాదాపు రూ.34.46 లక్షలు విలువ చేసే 03 ఆభరణాలు…వాటిలో స్వామివర్ల దీర్ఘచతురస్రాకార పతకం ఒకటి, అమ్మవర్ల దీర్ఘచతురస్రాకార రెండు పతకములను శాశ్వత ప్రాతిపదికన టిటిడి బహుకరించింది.
స్థానిక శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను ఊరేగింపుగా తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ఎం.లోకనాథం శ్రీగోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు.
అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరింప బడ్డ శ్రీ గోవిందరాజ స్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడవాహనంపై, నాలుగు మాడ వీధుల వెంట విహారిస్తూ, ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదిస్తారు.
అంతకుముందు గరుడ సేవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 - 5 గం.ల మధ్య స్వామి వారికి నూతన వస్త్రాలు, తిరువడి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి బజార్ వీధి, సన్నిధి వీధి నుండి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నాయి.
ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింప చేసాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ శ్రీ వి.ఆర్.గురురాజ స్వామి, ఏవీఎవ్వోలు శ్రీ రాజశేఖర్, శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.