28.6.25

Festivals at Sri Govindaraja Swamy Vari Temple in July





On July 1, in the advent of Pubba Nakshatram, Sri Govindaraja Swamy along with Sri Devi, Bhu Devi and Sri Andal will be ceremonially taken to Sri Pedda Jeeyar Mutt.

 
Ankurarpanam for Pushpayagam will be performed on July 1, followed by the Pushpayaga Mahotsavam on July 2. There will be no Unjal Seva on July 1 and 2.
 
From June 26 to July 5, Periyalwar Utsavam will be celebrated at Sri Lakshmi Narayana Swamy Temple located in the G.S. Mada Streets of Tirupati.
 
On July 4, 11, and 18 (Fridays), at 6 PM, Sri Andal Ammavaru / Pundarika Valli Tayaru will be taken in a grand procession along the four Mada Streets surrounding the temple.
 
Jyestabhishekam will be held from July 6 to 8.
 
Pournami Garuda Seva will be observed on July 10.
 
On July 13, in observance of Sravana Nakshatram, at 6 PM, Sri Kalyana Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi will bless the devotees through a procession in the four Mada Streets.
 
Anivara Asthanam will be held on July 16.
 
Sri Andal Tiruvadippuram Utsavam will be celebrated from July 19 to 28.
 
On July 25, the Varsha Tirunakshatram of Sri Chakrathalwar and Sri Prativadi Bhayankara Annan will be observed.
 
On July 29, in observance of Uttara Nakshatram, at 6 PM, Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi will bless devotees through a procession around the four Mada Streets.

27.6.25

Special Festivals in July at Vontimitta and Kadapa Temple




On July 10, on the occasion of Pournami, Sri Sitarama Kalyanotsavam will be performed at 9.30 AM.


SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE, DEVUNI KADAPA:

On July 01, on the occasion of Pubba Nakshatram, Andal Ammavari Snapanam will be held at 3.30 PM, followed by Gramaotsavam at 5 PM.

On July 02, on Uttara Nakshatram, Sri Padmavathi Ammavari Snapanam will be held at 3.30 PM, followed by Prakara Utsavam at 5 PM.

On July 13, on Sravana Nakshatram, Snapanam at 6.30 AM, followed by Kalyanotsavam at 10 AM. In the evening at 5 PM, Sri Lakshmi Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi, will be taken on Gramaotsavam.

On July 24, on Punarvasu Nakshatram, Snapanam at 3.30 PM, and Gramaotsavam at 5 PM.

On July 28, on Pubba Nakshatram, Andal Ammavari Snapanam at 3.30 PM, followed by Gramaotsavam at 5 PM.

On July 29, on Uttara Nakshatram, Sri Padmavathi Ammavari Snapanam at 3.30 PM, followed by Prakara Utsavam at 5 PM.

Every Saturday at 5 PM, Sri Lakshmi Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi will be taken on Gramaotsavam.

₹1 Cr Donated to TTD




A NRI devotee Sri Thota Chandrasekhar, has donated Rs. 1 crore to TTD SV Pranadana Trust on Thursday.

To this extent, the donor handed over the donation cheque to the TTD Chairman Sri B.R. Naidu at the latter's Camp Office in Tirumala.


నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ Nandaluru Temple




అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల టిటిడి ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవోతో కలిసి గురువారం ఛైర్మన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ జూలై 05 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీ అంకురార్పణ జరుగనుందన్నారు. భక్తులకు స్వామివారి దర్శనం, తాగునీరు, ప్రసాదాలు అందచేయాలని కోరారు.
జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
05-07-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
06-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
07-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
08-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
09-07-2024
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
10-07-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
11-07-2024
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
12-07-2024
ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
13-07-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
జూలై 06 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025, జూన్ 26: టిటిడికి అనుబంధంగా ఉన్న తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ మేరకు తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలసి ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 05వ తేదీ అంకురార్పణ జరుగనుంది.
శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :
జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 10న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ నిర్వహిస్తారు.
జూలై 11వ తేదీ సాయంత్రం 06 నుండి ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 12న సాయంత్రం 6.00 గంటలకు రథోత్సవం, జూలై 13న రాత్రి అశ్వవాహనం, జూలై 14న ఉదయం 9 - 10.15 గం.ల మధ్య చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :
జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 6 గం.లకు హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
జూలై 10న ఉదయం పల్లకీ సేవ రాత్రికి నంది వాహనం జరుగనుంది. జూలై 11న సాయంత్రం 06.00 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 07.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 12న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 13న సాయంత్రం 06.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 14న ఉదయం 10.00 - 12 గం.ల మధ్య వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 06 - 08 గం.ల మధ్య పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం Koil Alwar Tirumanjanam



శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర


స్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఆలయ నేపథ్యం : ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన తిరుమలయ్య పునరుద్ధరించినారు. ప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన ఈ గుడి, గోపురాలను పునర్నిర్మించి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిత్యపూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి, 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరాజ స్వామివారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానములు వారు చేపట్టి శ్రీవైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు.
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 01వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూప‌రింటెండెంట్ శ్రీ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

జూలై నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు Pamavati Ammavari Temple

 




• జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.
• జూలై 12న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు మాడ వీధులలో గజ వాహనంపై విహరించనున్న అమ్మవారు
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...
- జూలై 03, జూలై 30 తేదీలలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారు సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
• జూలై 16న దక్షినాయన పుణ్యకాలం సందర్భంగా సా. 5 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..
• జూలై 16న ఉత్తరభద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు
శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..
- జూలై 21న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై విహరించనున్న శ్రీ కృష్ణ స్వామివారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో....
• జూలై 01న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
- జూలై 09న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
- జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

Special Festivals in TTD Temples in July at Tiruchanoor Padmavati Ammavari Temple




On all Fridays of the month – July 4, 11, 18, and 25 – Sri Padmavathi Ammavaru will bless devotees on the Tiruchi Utsavam at 6 PM in the mada streets.


On July 12, in view of Uttarashada Nakshatram, Ammavaru will go on a procession atop Gaja Vahanam at 6:45 PM in the Mada Streets.

At Sri Suryanarayana Swamy Temple:

On July 3 and July 30, during Hasta Nakshatram, Sri Suryanarayana Swamy will give darshan on Tiruchi at 5 PM.

On July 16, on the occasion of Dakshinayana Punyakalam, Sri Suryanarayana Swamy will tour the Mada Streets on Tiruchi at 5 PM.

At Sri Sundararaja Swamy Temple:

On July 16, on the occasion of Uttarabhadra Nakshatram, Sri Sundararaja Swamy will be taken in a procession on Tiruchi around the Mada Streets at 6 PM.

At Sri Balakrishna Swamy Temple:

On July 21, on the occasion of Rohini Nakshatram, Sri Krishna Swamy will bless devotees on Tiruchi at 6 PM.

At Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple:

On July 1, the Ashtadala Pada Padmaradhana Seva will be performed at 8 AM.

On July 9, the Ashtottara Sata Kalashabhishekam will be conducted at 8 AM.

On all Fridays – July 4, 11, 18, and 25 – Vastralankarana Seva and Abhishekam will be held at 7 AM.