The annual three-day Jyestabhishekam festival commenced on a grand note at Sri Govindaraja Swamy Temple in Tirupati on Sunday. This traditional ritual is observed during every Ashada month.
Snapana Tirumanjanam was performed to the Utsava Murthis of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi at the Kalyana Mandapam in the Temple in the morning.
Later special pujas were offered to the Kavachams, followed by Kavachaadhivasam.
In the evening, the deities will bless devotees during a grand procession on Tiruchi along the four mada streets of the temple.
HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, Dy EO Smt. V.R. Shanthi, AEO Sri Munikrishna Reddy, temple priests, and other officials were also present.
టిటిడికి అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం వైభవంగా ధ్వజారోహణం నిర్వహించారు.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :
శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 06.16 గం.లకు ధ్వజారోహణంను చేపట్టారు. సాయంత్రం 06 గం.లకు హంసవాహన సేవపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 08.00 గం.లకు, సాయంత్రం 06.00 గం.లకు వాహన సేవలు జరుగనున్నాయి.
జూలై 11న సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. జూలై 14న ఉదయం 10.00 - 12.00 గంటలకు వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 05.00 - 06.00 గం.ల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 15వ తేదీన ఉదయం 09.00 గం.లకు స్నపన తిరుమంజనం, రాత్రి 06.00 - 08.00 గం.ల మధ్య పుష్పయాగం చేపడుతారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :
జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 07.00 గం.లకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 09.00 గం.లకు, రాత్రి 07.00 గం.లకు వాహన సేవలు ప్రారంభమవుతాయి.
జూలై 11వ తేదీ సాయంత్రం 6 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 14న ఉదయం 09.30 - 10.15 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 15వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ శ్రీ వై. హనుమంతయ్య, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ డి. బాలాజీ, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
The annual Brahmotsavams commenced in a grand manner with Dwajarohanam on Sunday at Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples in Tallapaka, Annamaiah district, under the aegis of TTD.
At Sri Siddheswara Swamy Temple, daily vahana sevas are scheduled at 8 AM and 6 PM, with Hamsa Vahanam on the evening of July 6, Arjita Kalyanotsavam on July 11, Vasantotsavam, Trishula Snanam, and Dwajavarohanam on July 14, followed by Snapana Thirumanjanam and Pushpayagam on July 15.
At Sri Chennakesava Swamy Temple, vahana sevas take place daily at 9 AM and 7 PM, with Sesha Vahanam on July 6 evening, Kalyanotsavam and Gaja Vahanam on July 11, Chakrasnanam and Dwajavarohanam on July 14, and Pushpayagam on July 15.
TTD’s Hindu Dharma Prachara Parishad and Annamacharya Project are organizing daily Harikathas and devotional music programs during the Brahmotsavams.
In view of Guru Pournami and Garuda Panchami, Garuda Vahana Seva will be observed twice during the month of July at the Tirumala.
On July 10, in connection with the auspicious Guru Pournami, and on July 29 following Garuda Panchami, Sri Malayappa Swamy will bless His devotees on the mighty Garuda Vahanam, parading along the four Mada streets between 7 PM and 9 PM.
తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది.
ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు పూజ నిర్వహించారు.
ఆనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను అన్నప్రసాదం, వడ రుచిపై ఆరా తీయగా, చాలా రుచికరంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడల వడ్డిస్తున్నప్పటికీ, ఆదివారం నుండి రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం రోజుకు సుమారు 70 వేల నుండి 75 వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారని చెప్పారు. శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలను తయారు చేస్తున్నామని తెలిపారు. భోజనం నాణ్యతను మెరుగుపర్చే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ పేర్కొన్నారు.
కాగా ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
The tasty and delicious ''Vada'' in Annaprasadam Menu will be henceforth served from 11am to 10pm everyday in the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) asserted the TTD Trust Board Chairman Sri BR Naidu.
Accompanied by one of the Board Member Sri Shantaram, he visited the MTVAC in Tirumala on Sunday evening and commenced Vada serving in the evening Annaprasadam menu to the devotees.
Speaking to the media later on the occasion he said, with an aim to provide tastier Annaprasadam, TTD commenced serving Vada in MTVAC from March 06 early this year. ''From today onwards, Vada will be served till the end of the day in Annaprasadam Complex. On an average nearly 70-75thousand Vadas will be served to the devotees everyday in MTVAC, he added.
Meanwhile the mouth-watering Vada in Annaprasadam Menu is being prepared by TTD with an amalgamation of Bengal Gram, green chillies, Ginger, Curry, Coriander and Pudina leaves along with fennel seeds.
The devotees have also expressed immense pleasure over the gesture of extending serving of Vada in Annaprasadam Menu to the devotees from 11am to 10pm in MTVAC.
Annaprasadam DyEO Sri Rajendra Kumar, Catering Special Officer Sri GLN Sastry and others were also present.