7.7.25

The 100 Movie Pre-Release Event Stills-01








































 

Pavitrotsavams Begins at Sri Kapileswara Swamy Vari Temple






The annual Pavitrotsavams at the famous and ancient TTD run temple dedicated to Lord Shiva, Sri Kapileswara Swamy temple commenced on Sunday evening with the traditional Ankurarpanam.

The three-day festival is observed to rectify any lapses in rituals performed throughout the year, as per Saiva Agama traditions.
On July 7, Snapana Tirumanjanam, Kalasha Puja, Homam, and Pavitram installation will be conducted.
On July 8, Granthi Pavitram, Yagashala Puja, and Homam are scheduled.
On July 9, Maha Purnahuti and Pavitramala Samarpana will take place, followed by a grand Panchamurthi procession at 6 PM.
Temple priests and officials participated in the inaugural rituals.

శ్రీ కపిలేశ్వరాలయంలో అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు Sri Kapileswara Swamy Vari Temple








తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో  09వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం 06.00 గంటలకు అంకురార్పణ నిర్వహించారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూలై 07న మొద‌టిరోజు సోమవారం ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు.
జూలై 08న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు.
జూలై 09న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ  అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం Jyestabhishekam










తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు  శ‌త‌క‌ల‌శ‌ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. 
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.