16.7.25

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ Srirangam temple





ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


బుధ‌వారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీ‌ధ‌ర‌న్ కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి మ‌ణివాస‌గం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ శివ‌రామ్ కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ సుంద‌ర బ‌ట్ట‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

Kothapallilo Okappudu Movie Press Meet



























 

TTD Chairman Dines with Devotees at MTVAC





TTD Chairman Sri B.R. Naidu, along with some TTD Board Members, dined with devotees at the Matru Sri Tarigonda Vengamamba Annaprasadam Complex in Tirumala on Tuesday evening.


Several devotees expressed their happiness to the Chairman, stating that the rice was soft and the dishes were delicious.

They especially conveyed their appreciation for serving vada during the night meal and thanked the Chairman for the thoughtful addition.

Expressing satisfaction with the annaprasadam distribution system, the Chairman directed officials to ensure that hygienic and tasty food is consistently provided to the devotees without leaving any room for complaints.

TTD Board Members Smt. Panabaka Lakshmi, Sri Janga Krishnamurthy, Sri Shanta Ram, Sri Naresh Kumar, and Smt. Janaki Devi also joined the Chairman in dining with the devotees.

Annaprasadam DyEO Sri Rajendra was also present.

తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన టీటీడీ చైర్మన్ TTD Chairman






తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బోర్డు సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.


ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్‌తో మాట్లాడుతూ అన్నప్రసాదంలో అందిస్తున్న అన్నం చాలా మృదువుగా, వంటకాలు రుచికరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాత్రి భోజనంలో వడను వడ్డించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అన్నప్రసాద వితరణ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్, భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎల్లప్పుడూ రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించేలా నిరంతరం పరిశుభ్రతతో కూడిన వంటకాలను సిద్ధం చేసి అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి జానకీ దేవిలు కూడా చైర్మన్ తో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈ వో శ్రీ రాజేంద్రకుమార్ కూడా ఉన్నారు.

TTD Chairman Conducts Surprise Inspection in Tirumala




TTD Chairman Sri B.R. Naidu conducted a surprise inspection in Tirumala to review the services and amenities being provided to the  pilgrims by TTD on Tuesday evening.


The Chairman, along with a few TTD board members inspected the premises of Srivari temple and interacted with devotees to gather feedback on various facilities. 

He also inquired about the availability of drinking water, food distribution under Annaprasadam, queue management and overall sanitation.

Several devotees expressed their happiness to the Chairman, stating that the facilities and services in Tirumala have significantly improved in recent times. They also praised the quality and taste of the food being served in the Annaprasadam Complex.

TTD Board Members Smt. Panabaka Lakshmi, Sri Janga Krishnamurthy, Sri Shanta Ram, Sri Naresh Kumar, and Smt. Janaki Devi, along with officials and staff, participated in the inspection.

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తణిఖీలు Surprise inspection







తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు, సదుపాయాల నిర్వహణపై మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు ఆకస్మిక తణిఖీలు నిర్వహించారు.


శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్, బోర్డు సభ్యులు అక్కడ భక్తులతో మమేకమై వివిధ సేవా సౌకర్యాలపై ఆరా తీశారు. తిరుమలలో త్రాగునీరు, అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్ తో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సదుపాయాలు, సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, అన్నదానంలో అందిస్తున్న అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి జానకీ దేవి, అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

తాళ్ళ‌పాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆల‌యాలలో వైభ‌వంగా పుష్పయాగం Tallapaka temples




అన్నమయ్య జిల్లా తాళ్ళ‌పాక‌లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జ‌రిగింది.


ఇందులో భాగంగా ఉద‌యం 9 గం.లకు శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారికి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.    

సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, తులసి, దవ‌నము వంటి పుష్పాలు, ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

జూలై 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. బ్రహ్మోత్సవాల్లో, నిత్య కైంకర్యాల్లో తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.