19.9.25

Plastic Waste Recycling Machine




The Additional EO Sri Ch Venkaiah Chowdary  monitored the functioning of Reklaim Ace, a unique plastic waste recycling machine installed at PAC 5 on Thursday evening.


The representatives from the Hyderabad based firm including its chief Sri Vivek explained the Additional EO about its utility and need to sensitize people on the same.

He said so far the machine was installed at Chardam, Uttarakhand to collect the bottle waste instead of throwing them and polluting sacred waters in Ganges. 

The public can throw the tetra packs, snacks packets in this machine by logging via UPI and scanning the QR code, dropping the waste packet inside the ring. For which the person will be awarded with Rs. 5 as part of creating social awareness and supporting the cause of environment protection'', he added.

The Additional EO appreciated the working and utility of the unique machine.

EE5 Sri Venugopal, DE Electrical Sri Chandra Sekhar and others were also present.

ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం పరిశీలన plastic waste





తిరుమల పీఏసీ–5లో ఏర్పాటు చేసిన వినూత్నమైన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం Reklaim Ace పనితీరును అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం సాయంత్రం పరిశీలించారు.

ఆ సంస్థ అధిపతి శ్రీ వివేక్ యంత్రం ఉపయోగాలను వివరించడంతో పాటు ప్రజలకు దీని అవసరంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఇప్పటికే ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని చారధామ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసి భక్తులు ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను పవిత్ర గంగా జలాల్లో వేయకుండా, వాటిని సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ అయ్యి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి,
రింగ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలివేస్తే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందని తెలిపారు. దీని ద్వారా సామాజిక అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యమని ఆయన తెలియజేశారు.
ఈ వినూత్న యంత్రం పనితీరును అదనపు ఈవో ప్రశంసించారు.
ఈ సందర్బంగా ఈఈ-5 శ్రీ వేణు గోపాల్‌, ఎలక్ట్రికల్‌ డిఈ శ్రీ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Koil Alwa Tirumanjanam Held




The koil alwar Tirumanjanam in view of Sri Kamakshi Ammavaru Navaratri Utsavams was held in a grand manner in Sri Kapileswara Swamy temple in Tirupati on Thursday.


The 11 day fete will be observed from September 22 to October 02.

The temple DyEO Smt Nagaratna and others participated.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam





తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబ‌రు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురార్ప‌ణ‌, న‌వ క‌ల‌శ స్థాప‌న‌, వాస్తుపూజ నిర్వ‌హిస్తారు.
ఇందులో భాగంగా  సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబరు 25న మావడి సేవ అలంకారం, సెప్టెంబ‌రు 26న శ్రీ గాయ‌త్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్రిపుర సుంద‌రి, సెప్టెంబరు 28న శ్రీ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారు, సెప్టెంబ‌రు 29న‌ శ్రీ‌అన్నపూర్ణాదేవి, సెప్టెంబరు 30న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ‌ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్రీ శివ‌పార్వ‌తుల‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంట‌ల‌కు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

TTD Addl Eo Reviews Reception Depratment




In connection with the Srivari Brahmotsavams to be held from September 24 to October 02, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdhury held a review meeting on reception and Annaprasadam departments along with CVSO Sri Muralikrishna on Thursday at Annamayya Bhavan in Tirumala.


On this occasion, he ordered that steps be taken to allocate accommodation rooms so that devotees do not face any difficulties during the Brahmotsavams.

The reception and protocol departments should work in coordination so that there are no shortcomings in the accommodation facilities for VIPs visiting the Brahmotsavams.

He said that the rest houses should be inspected and any repairs should be completed as soon as possible. 

He advised the employees performing duties in the temple to work responsibly with discipline.

The Reception Deputy EO Sri Bhaskar, VGO Sri Surendra, OSD Satre Naik and other officials participated in this meeting.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




తెనాలికి చెందిన శ్రీ తడిబోయిన విజయ సాగర్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు  రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 10 lakhs donation




విజయ నగరానికి చెందిన శ్రీ కృష్ణ హరీశ్ ఈశ్వర అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.