A devotee, Sri Krishna Harish Eswara from Vizianagaram, donated Rs. 10, 00, 116 to the TTD-run Sri Balaji Aarogya Varaprasadini scheme (SVIMS)on Thursday.
He handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s camp office in Tirumala.
TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present.
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో రిసెప్షన్ విభాగంపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు.
విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.
అంతకు పూర్వం ఆయన అన్న ప్రసాద విభాగ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఓఎస్డీ సత్రా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
The sacred Sri Seshachala Lingeshwara Swamy Temple, located at Kandulavari Palle in Chandragiri Mandal, will host the annual Navaratri Utsavams from September 22 to October 02.
As part of the celebrations, daily morning Abhishekam will be performed to Sri Seshachala Lingeshwara Swamy, Parivara Devathas, and Sri Umamaheshwari Ammavaru.
On October 02 (Vijayadashami), a special Rudra Homam will be conducted at 10 AM.
During Navaratri, Ammavaru will be adorned in different divine forms each day.
September 22 – Sri Umamaheshwari Devi Alankaram
September 23 – Sri Bala Tripura Sundari Devi Alankaram
September 24 – Sri Gayatri Devi Alankaram
September 25 – Sri Annapurna Devi Alankaram
September 26 – Sri Lalita Devi Alankaram
September 27 – Sri Mahalakshmi Devi Alankaram
September 28 – Sri Mahishasura Mardini Alankaram
September 29 – Sri Saraswati Devi Alankaram
September 30 – Sri Durga Devi Alankaram
October 1 – Sri Rajarajeshwari Alankaram
October 2 – Sri Rajarajeshwari Devi Alankaram (special Vijayadashami darshan)
Devotees are invited to participate in these auspicious celebrations and receive the divine blessings of Sri Seshachala Lingeshwara Swamy and Sri Umamaheshwari Ammavaru.
చంద్రగిరి మండలం కందులవారి పల్లెలో వెలసిన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సదరు రోజులలో ఉదయం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి, పరివార దేవతలకు, శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. అక్టోబర్ 02వ తేదీన విజయదశమి సందర్భంగా రుద్ర హోమం ఉదయం 10 గం.లకు జరుగనుంది.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 22న ఉమామహేశ్వరి దేవి అలంకారం, 23వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం, 24వ తేదీ శ్రీ గాయత్రి దేవి అలంకారం, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, 26వ తేదీ శ్రీ లలితా దేవి అలంకారం, 27వ తేదీ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం, 28వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి దేవి అలంకారం, 30వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం, అక్టోబర్ 01వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, అక్టోబర్ 02వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Terming that Annaprasadam activity by TTD has been receiving humongous response from the devotees across the world for its quality and taste, which has impacted on the incredible increase on its corpus funds in 2024-25 till now, asserted TTD EO Sri Anil Kumar Singhal.
The EO had inspected MTVAC on Thursday evening. As a part of the inspection he interacted with the devotees and enquired them about darshan timings, token system, facilities in queue lines, taste of Annaprasadam, serving of Annaprasadam at several points in Tirumala and many more.
He also checked the taste of all delicacies in the kitchen, store room, cashewnut boxes and made a few suggestions to the officers concerned. He also interacted with the canteen workers, Srivari Sevaks.
Later speaking to media persons he said Annadanam was commenced in the year 1985 and became Annaprasadam Trust in 1994. Up to 2020, TTD used to give some grant to run Annaprasadam activity until it became self reliant. Every year the donations are increasing along with the corpus as well as its interests. The corpus in 2023-24 stood at 1854cr while in 2024-25-2127cr and in 2025 till August 2263.
The interests also increased from 221cr in 2024 to 270cr in 2025 and met its 150cr annual expenditure sufficiently. Even the 1cr donations have also increased.
In 2023-24 one crore donors were 14 while in 24-25 it was 25 and in the last five months this year 14 members have donated over one crore to the trust.
The devotees are coming forward with largesse for Annaprasadam Trust with a lot of credibility on TTD services to devotees since the last four decades.
''We are now focussed on annual brahmotsavams. And the devotee Feedback through e-mails, Dial your EO, WhatsApp, Survey, IVRS plays an important role in improving the system wherever needed with the support of TTD board and employees, he maintained.
Annaprasadam DyEO Sri Rajendra Kumar, special Catering Officer Sri Shastry and others were present.
టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింగాల్ అన్నారు.
గురువారం సాయంత్రం ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూ లైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్న ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు.
వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్స్‌లను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్న ప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమై, 1994లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడిందని చెప్పారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిందని, ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు.
ప్రతి ఏటా విరాళాలు పెరుగుతున్నాయని, కార్పస్ నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
2023–24లో కార్పస్ రూ.1854 కోట్లు, 2024–25లో రూ.2127 కోట్లు, 2025 ఆగస్టు వరకు రూ.2263 కోట్లకు చేరిందని వివరించారు.
వడ్డీలు రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగిందని, ప్రస్తుతం వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉందని తెలిపారు. రూ.కోటి విరాళదారులు కూడా పెరిగారని, 2023–24లో 14 మంది ఉంటే, 2024–25లో 25 మంది, ఈ సంవత్సరం ఐదు నెలల్లోనే 14 మంది రూ.కోటి పైగా విరాళం అందజేశారని చెప్పారు.
గత నాలుగు దశాబ్దాలుగా టీటీడీ భక్తులకు అందిస్తున్న విశ్వసనీయ సేవలతో భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం తాము వార్షిక బ్రహ్మోత్సవాలపై దృష్టి సారించామని, భక్తుల అభిప్రాయాలు, ఈ-మెయిల్, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్వే, IVRS ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు, సిబ్బందంతా సహకరిస్తున్నారని ఈవో తెలిపారు.
ఈ తనిఖీల్లో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.