22.9.25

గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టీటీడీ umbrella




శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబర్ 27న తిరుమలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఈ మేరకు వినతి చేస్తున్నది.

IDBI Donates 18 Cleaning Machines to TTD






As part of its Corporate Social Responsibility (CSR), IDBI Bank donated 18 cleaning machines worth ₹19 lakhs to the Health Department of TTD on Sunday.


On this occasion, the Bank’s MD & CEO, Sri Rakesh Sharma, handed over the machines to TTD Peishkar Sri Ramakrishna in front of the Srivari Temple.

Deputy EO Health Sri Somannarayana, Health Officer Dr Madhusudan, IDBI Bank Regional Head Sri Saikrishna, Tirupati Branch Head Sri Palli Ramesh, and Branch Manager Sri Dudala Rajesh participated in the program.

They Call Him OG Concert Event Photos












 

టీటీడీకి 18 క్లీనింగ్ యంత్రాలు విరాళం cleaning machines





కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) లో భాగంగా IDBI బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మెషీన్లను ఆదివారం విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈఓ శ్రీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ శ్రీ రామకృష్ణ కు యంత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ శ్రీ సోమన్నారాయణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ శ్రీ దూడల రాజేష్ పాల్గొన్నారు.

21.9.25

Constructive Suggestions are Always Welcome - TTD Addl Eo




While welcoming constructive suggestions from media, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary said, protecting the sanctity and serenity in Tirumala is everyone's responsibility and especially the media by giving proper information to the pilgrim public.


An informal meeting with the media at Annamayya Bhavan was held on Saturday. 

Speaking on the occasion the Additional EO said, with the social media gaining pace in recent times, most of the YouTubers are trying to confuse devotees with fake and baseless reports rather than  correct information. 

''By doing this we are misleading the devotees across the globe which is not at all a healthy practice. Infact the responsibility of protecting sanctity of Tirumala Hills and promoting TTD activities is more on you as you have better knowledge in all subjects related to Tirumala development since you all have been reporting here for several years'', he maintained.

CVSO Sri Muralikrishna, DFO Sri Phanikumar Naidu, Chief PRO Dr T Ravi were also present.

తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం మనందరి బాధ్యత టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo




తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా భక్తులకు సరైన సమాచారం అందించే విషయంలో మీడియా పాత్ర మరింత కీలకమైనదని టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధుల నుండి ప్రయోజనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగంగా పెరుగుతోందని, కానీ చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అవాస్తవ మైన ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలు  ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు.
తిరుమల కొండల పవిత్రతను కాపాడటం, టీటీడీ కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో మీడియాపై ఎంతో బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న  మీడియా ప్రతినిధులకు తిరుమలలో జరుగుతున్న అభివృద్ధిపై, భక్తులకు టీటీడీ అందిస్తున్న విశేష సేవలపై ఎంతో అవగాహన ఉంటుందని తెలిపారు.
టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేసే వారిని నియంత్రించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు.
ఈ సమావేశంలో డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సీపిఆర్వో డాక్టర్ టి. రవి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

Chief Pontiff of Sri Palimaru Mutt, Udipi Offered Prayers to Lord Venkateswara







His Holiness Sri Sri Sri Vidyadheesha  Theertha Swamiji,Sri Palimaru  Mutt, Udipi visited Sri Vari Temple, Tirumala on Saturday morning. On his arrival at infront of Sri Vari Temple, DyEO Sri Lokanadham and Temple Priests welcomed him with Temple Honours and led him to the Sanctum Santorium.

 
Potu Peishkar Sri Srinivasulu and others were present.