24.9.25

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ANKURARPANAM





















తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

విశిష్టత..
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
సూర్యాస్తమయం తరువాతే..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా srivani break darshan




పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ 29, 30 మరియు 31  (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం   మరియు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయబడవు.

ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో టీటీడీ విడిగా ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.

23.9.25

Gold Medallions Donated




An anonymous devotee from Chennai has donated nine gold medallions worth Rs. One crore to Sri Venkateswara of Tirumala on Monday.

The donor handed over the medallions to TTD officials at the Ranganayakula Mandapam inside the temple.

15 Gold Medallions and Two Silver Platesto Sri Venkateswara





His Holiness Srimad Vidyadheesha Theertha Swamiji, the Pontiff of Shree Samsthan Gokarna Partagali Jeevottama Mutt has donated 15 gold medallions and two silver plates worth Rs. 1.80 crore to Sri Venkateswara Swamy on Monday.


The Swamiji presented the offerings to Sri Ramakrishna, temple Peishkar at the Ranganayakula Mandapam of the Tirumala temple.

Temple Bokkasam In-charge Sri Gururaja and others also participated in the programme.

60 Kilo Darbha Mat and 100 Kilo Darbha Rope to be Used During Dhwajarohanam





The celestial procession of the Darbha Mat and Darbha Rope used during Dhwajarohanam ceremony as a part of Srivari Salakatla Brahmotsavams was held on Monday. The parade commenced from TTD forest department office led by its DFO Sri Phani Kumar Naidu and his staff.


Later, the mat and rope made of darbha were placed on the Sesha Vahanam inside the Ranganayakula Mandapam of the Srivari temple. The hoisting of Garuda flag on the temple on the evening of September 24 marks the beginning of the nine-day Brahmotsavam.

Darbha and its significance in temple rituals: Darbha is a long grass believed to symbolize purity and auspiciousness. The grass is traditionally believed to shield people and environments from negative energies and toxic radiation. Darbha are worn by priests and devotees during rituals to enhance the sanctity of their prayers and protect them spiritually.Darbha embodies both spiritual symbolism and ritual utility, and remains an essential part of Hindu religious life and heritage. 

Vishnu Darbha: For the preparation of this sacred mat and rope, every year the TTD forest staff collects Vishnu Darbha in Chelluru village of Erpedu mandal. It was brought to Tirumala and dried in the low sun for a week, cleaned well and made into mats and ropes. The forest department staff prepared a darbha mat measuring 22 feet long and seven and a 7.5ft wide weighing around 60kg while a rope made of Darbha measuring 225m in length and weighing over 100kg. Both these holy grass materials are used during Dhwajarohanam-the sacred Garuda flag hoisting ceremony on September 24 between 5:43pm to 6:15pm in the auspicious Meena Lagnam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు long grass






శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి సోమవారం డిఎఫ్‌వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.


అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల వరకు మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.

ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం

బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.

ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్భ చాప, 255 మీటర్ల పొడవైన 106 కిలోల తాడు సిద్ధం చేశారు.

దర్భ వైశిష్ట్యం 

దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అని దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన శ్రేష్ఠఫలితాలను ఇస్తుందని పేర్కొంది. శాస్త్రీయంగా చూసినా ఇందులో సిలికా అధికంగా ఉండటంతో వాతావరణ శుద్ధి, సూక్ష్మక్రీముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం, దైవిక వరమని భావించబడుతుంది.

శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం gold medallions





శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో  బహుకరించారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.