16.3.26

Ankurarpanam Held




In connection with the annual Pushpayagam at Srinivasa Mangapuram on March 15, Ankurarpanam was observed on Saturday evening.


Temple Spl Gr DyEO Smt Varalakshmi and other temple staff were present.

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ ankurarpanam




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 15 జరుగనున్న పుష్పయాగానికి శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.


సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుణ్యాహ‌ వ‌చ‌నంమృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వంఅంకురార్పణం చేపట్టారు.


మార్చి 15న‌ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఇందులో పాలుపెరుగుతేనె,  పసుపుచందనంకొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారుమధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిమల్లెజాజి సంపంగిరోజాకలువలు వంటి లురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.


బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులుఅధికార అనధికారులుభక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు రిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.


శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 15 నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.


 కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిసూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ ముని శంక‌ర్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌ పాల్గొన్నారు

15.3.26

Koil Alwar Tirumanjanam at Sri Pattabhirma Swamy Vari Temple, Valmikipuram on 17th March




Koil Alwar Thirumanjanam will be performed as per Agama traditions on March 17 at Sri Pattabhirama Swamy Temple located in Valmikipuram of Annamayya District. It is known that the annual Brahmotsavams of the temple will be held from March 24 to April 2. Conducting Koil Alwar Thirumanjanam before the Brahmotsavams is a traditional practice.


On this occasion, the Lord will be awakened with Suprabhatam in the morning, followed by Thomala Seva and Sahasranamarchana. Later, Koil Alwar Thirumanjanam will be performed. As part of the ritual, the temple premises will be cleansed and a fragrant mixture prepared with turmeric, kumkum, sandalwood, camphor, kacholam, kasturi turmeric and other aromatic ingredients will be sprinkled on the walls of the sanctum sanctorum.


Ankurarpanam on March 23


In connection with the annual Brahmotsavams of Sri Pattabhirama Swamy Temple, Ankurarpanam will be conducted grandly on March 23 from 6 pm to 9 pm. On this occasion, Senadhipati Utsavam, Medini Puja and Mrutsangrahanam and other rituals will be performed.

మార్చి 17న శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం alwar tirumanjanam




అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మార్చి 17 శాస్త్రోక్తంగా ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.  ఆలయంలో మార్చి 24 నుండి ఏప్రిల్ 02 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవసహస్రనామార్చన నిర్వహిస్తారునంతరం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందిఇందులో భాగంగా లయాన్ని శుద్ధి చేసిపసుపుకుంకుమచందనంకర్పూరంకిచిలిగడ్కస్తూరి పసుపుపచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేస్తారు.


మార్చి 23 అంకురార్పణ :


శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 23  తేదీ రాత్రి 6 నుండి 9 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది సందర్భంగా సేనాధిపతి ఉత్సవంమేదిని పూజమృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Asthanam Line up in Tirumala Temple




Three Asthanams have been lined up in the month of March this year in Tirumala temple following the upcoming important festivals including Telugu Ugadi and Sri Ramanavami.


Asthanam - the traditional Temple Court is usually observed in the Garudalwar Sannidhi on the special occasions earmarked in the temple.


Ugadi Asthanam: 


On the auspicious day of Sri Parabhava Nama Samvatsara Ugadi, a set of new clothes is being draped to both main and processional deities. The Vedic scholars present the year's Panchangam in front of the deities and perform Asthanam between 7am and 9am.


Sri Rama Navami Asthanam: 


On the occasion of Sri Rama Navami on March 27, the temple court is being observed between 9pm and 10pm at Garudalwar Sannidhi.


Earlier, the Hanumanta Vahana Seva will also be observed on the occasion in Tirumala between 6:30pm and 8pm.


As a part of Asthanam, the Vedic Pundits presents Sri Rama Jananam(Birth of Sri Rama) chapter from Srimad Ramayana and perform Asthanam.


Pattabhisheka Asthanam: 


On the succeeding day of Sri Rama Navami, the Pattabhisheka Asthanam is being observed in Tirumala temple between 8pm and 9pm.


The Vedic scholars present the Coronation Ceremony episode of Sri Ramachandra Murty from the sacred epic Srimad Ramayana on the occasion.

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు srivari temple




తెలుగు ఉగాదిశ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని  మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు.


ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే ఆలయ దర్బారుప్రత్యేక పర్వదినాలలో గరుడాళ్వార్ సన్నిధిలో  కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.


ఉగాది ఆస్థానం


మార్చి 19 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మూలవిరాట్ మరియు ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పిస్తారు సందర్భంగా వేదపండితులు స్వామివారి సన్నిధిలో కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారుఉగాది ఆస్థానం ఉదయం గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.


శ్రీరామనవమి ఆస్థానం


మార్చి 27 తేదీన శ్రీరామనవమి సందర్భంగా గరుడాళ్వార్ సన్నిధిలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారుదీనికి ముందు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహించబడుతుందిఆస్థానం సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామ జనన ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.


పట్టాభిషేక ఆస్థానం


శ్రీరామనవమి తరువాతి రోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు తిరుమల ఆలయంలో పట్టాభిషేక ఆస్థానం నిర్వహిస్తారు సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.


14.3.26

Bel Fruit Juice | ఎండ తీవ్రతనుండి ఉపశమనమిచ్చే మారేడు పండు జ్యూస్ https://youtu.be/6Aqfs34f9j8


Bel Fruit Juice | ఎండ తీవ్రతనుండి ఉపశమనమిచ్చే మారేడు పండు జ్యూస్

https://youtu.be/6Aqfs34f9j8