24.3.26

మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి tumburu mukkoti




తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో భక్తుల కోసం చేయాల్సి  ఏర్పాట్లపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.


సమావేశంలోని ముఖ్యాంశాలు:


భక్తుల భద్రత దృష్ట్యా తుంబురు తీర్థానికి మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తారీఖులలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే  అనుమతిస్తారు.


పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారంఅన్న‌ప్ర‌సాదాలుత్రాగునీటిని 100 మంది శ్రీవారి సేవకులు ద్వారా పంపిణీ చేస్తారుప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలుఅంబులెన్సులుమందులుపారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.


తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకుదీర్ఘవ్యాధిగ్రస్తులకుగుండెశ్వా కోస సమస్యలుస్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.


భ‌క్తులు వంట సామగ్రిక‌ర్పూరంఅగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


పోలీసుశాఖఅటవీశాఖటీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.


తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారుట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారుప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.


 విషయాలను దృష్టిలో ఉంచుకుని హకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.


సూర్య కిరణాల తేజస్సులో విరాజిల్లిన శ్రీ కోదండరాముడు surya prabha vahanam










తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.


ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


సూర్యుడు తేజోనిధిసకలరోగ నివారకుడుప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలువాటివల్ల పెరిగే సస్యాలుచంద్రుడుఅతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.


అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమే శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో అభిషేకం చేశారు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


మార్చి 24 రథోత్సవం :


శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా జరుగనుందిఉదయం 7.30 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారుఉదయం 8.30 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారురాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.


23.3.26

Donation of ₹ 1 Cr to TTD




Subbarow Apparels, a Chennai-based firm, donated 1 crore on Sunday to the TTD-run 'Sri Balaji Arogya Varaprasadini' scheme (SVIMS).


In this regard, the donor, Sri J. Raja Ramesh, handed over the donation cheque to the TTD Additional Executive Officer, Sri Ch. Venkaiah Chowdary, at the latter's bungalow in Tirupati.


TTD Board Member Sri Bhanu Prakash Reddy participated in this event.

Artistic Splendor at Sri Kodanda Rama Swamy Vari Brahmotsavams






As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy, devotional music and dance programs organized on the cultural stage in the temple premises on Sunday captivated the devotees.


From 6:00 to 7:15 p.m., college lecturer Mrs. K. Vandana enthralled the audience with her melodious vocal concert, rendering keertanas such as “Namo Namo Raghukula Nayaka”, “Sara Sara Samaraika Soora”, “Mari Vere Dikkewarayya Rama”, “Dasharatha Rama Govinda”, “Kodandarama Kodandarama”, and “Brova Bharama”.


Following this, from 7:15 to 8:30 p.m., Dr. Monisha Naveen’s troupe presented a Bharatanatyam performance that delighted the spectators. The recital beautifully depicted items including “Hanuman Chalisa”, “Kalyana Rama”, “Sri Hari Stotram”, “Rama Rama”, “Sri Ramachandra Kripalu”, “Chinnishishuvu”, “Ganapati Bhajan”, “Lakshmi Kautham”, “Andal Kautham”, “Krishna Krishna Bhajan”, and “Tillana”.


These programs, blending devotion, culture, and spirituality, offered devotees a unique and profound experience.


శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో కళా వైభవం brahmotsavams







శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై నిర్వహించిన భక్తి సంగీతనృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


సాయంత్రం 6 నుంచి 7.15 గంటల వరకు జరిగిన గాత్ర కచేరీలో కళాశాల ధ్యాపకురాలు శ్రీమతి కేవందన “నమో నమో రఘుకుల నాయక”, “శర శర సమరైక సూర”, “మరి వేరే దిక్కెవరయ్య రామ”, “దశరథ రామ గోవిందా”, “కోదండరామ కోదండరామ”, “బ్రోవ భారమా” వంటి కీర్తనలను సుమధురంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.


తదుపరి రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు డామోనీషా నవీన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రదర్శనలో “హనుమాన్ చాలీసా”, “కళ్యాణ రామ”, “శ్రీ హరి స్తోత్రం”, “రామ రామ”, “శ్రీ రామచంద్ర కృపలు”, “చిన్నిశిశువు”, “గణపతి భజన్”, “లక్ష్మీ కౌతం”, “ఆండాళ్ కౌతం”, “కృష్ణ కృష్ణ భజన్”, “తిల్లాన” వంటి అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు.


 కార్యక్రమాలు భక్తిసంస్కృతిఆధ్యాత్మికతల సమ్మేళనంగా భక్తులకు అపూర్వానుభూతిని కలిగించాయి.

Lord Rama Enchants Devotees Gaja Vhana Seva






As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati, the Lord graced devotees on Sunday evening at 7 PM, riding on the Gaja Vahana (elephant mount), captivating all with divine splendor.


As majestic elephants, bulls, and horses led the procession, bhajan groups performed devotional singing and kolatam dances. The Lord was taken in a grand procession through the four Mada streets surrounding the temple.


In Sanatana Dharma, the elephant mount holds special significance. Whether in battlefields, royal courts, or festive occasions, the elephant occupies a place of prominence. In this sacred Vahana Seva, just as Gajendra carries the Lord, devotees are reminded to carry Lord Kodandarama in the sanctum of their hearts and thereby receive His divine grace.


Among those present during the Vahana Seva were Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Deputy Executive Officer Smt. Nagaratna, Temple Inspector Sri Suresh, priests, and a large number of devotees.

గజవాహన సేవలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన రాముడు gajavahanam






తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

 

గజరాజులువృషభాలుఅశ్వాలు ముందు కదులుతుండగాభజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆల నాలుగు మాడవీధుల్లో విహరించారు.

   

హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉందిరణరంగంలో గానీరాజదర్బారుల్లో గానీఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానంఅటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు  భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

 

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్అర్చ‌కులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.