30.3.26

వటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడు వైభవం vatapatrasai












ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.


ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగిందిభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తించగామంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు భక్తిరసంతో నిండిపోయింది.


 అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం జలప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు.

 కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆనందంగా కనిపిస్తారు దివ్యరూపాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.


 భక్తుల కష్టాలను తొలగించి రక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్వామివారు  అలంకారం ద్వారా సందేశం ఇస్తున్నారని పండితులు తెలిపారువటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో కూడా విశేషంగా వర్ణించారు.


 వాహనసేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ నవీన్‌ఆలయ అర్చకులుఅధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Sri Sita Rama Lakshmana Bless Devotees on Simha Vahanam







As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Vontimitta, Sri Sita Rama Lakshmana blessed the devotees on the Simha Vahanam on the third day, Sunday, at 7:00 PM.


Amidst the rhythmic beats of Kerala drums, devotional groups performed Chekka Bhajans and Kolatam, praising the Lord. The procession of the deities was carried out in a grand and festive atmosphere with traditional musical instruments. Devotees offered camphor harati at every step and had darshan of the Lord.


Among the ten incarnations (Dashavatara) of Lord Vishnu, Narasimha is the fourth incarnation, symbolizing the greatness of the lion. In yogic philosophy, the lion represents strength (carrying power) and speed (swift movement). The inner significance of the Vahana Seva is that when a devotee possesses lion-like devotion and strength, the Lord bestows His divine blessings.


Temple Deputy EO Smt. Prashanthi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen, along with a large number of devotees, participated in the event.

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం simha vahanam








ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.


కేరళ డ్రమ్స్భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోందియోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తిఆదర్శంగా భావిస్తారుభక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్యటెంపుల్ న్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌విశే సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


Sri Rama Pattabhishekam Performed Grandly at Sri Kodanada Rama Swmay Vari Temple






Sri Rama Pattabhishekam was performed in a grand manner on Sunday night at the Sri Kodandarama Swamy Temple in Tirupati.


The day began with Suprabhatam, awakening the Lord, followed by Abhishekam to the Moolavarlu. At 8:00 AM, the Utsava deities were taken to the Unjal Mandapam. Later, Abhishekam was performed to Sri Kodandarama Swamy using the sacred water brought from Narasimha Teertham. From 9:00 AM to 11:00 AM, rituals including Agni Pratishta and Chaturdasa Kalasa Snapana Tirumanjanam were conducted in the Yagasala.


Sri Rama Pattabhishekam was performed ceremoniously from 7:00 PM onwards. From 8:30 PM to 9:30 PM, Sri Sita Rama Lakshmana on the Golden Tiruchi and Sri Anjaneya Swamy on a special Tiruchi will be taken in a grand procession along the four Mada Streets of the temple, blessing the devotees.


Temple Deputy EO Smt. Nagaratna, Temple Inspector Sri Suresh, other officials, and a large number of devotees participated in the event.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం ramapattabhishekam






తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిమూలవర్లకు అభిషేకం నిర్వహించారుఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారుఅనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారుఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్టచతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.


రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగిందిరాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులుప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్‌ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirumala Laddus Dispatched for Vontimitta Kalyanam





Around 300 Srivari Sevaks were involved in the packing of 85,000 Srivari Laddus which were dispatched to Vontimitta in Kadapa district on Sunday.


Under the supervision of Estates Officer of Tirumala and DyEO Parakamani(I/C)Sri Venkateswarulu and his team of office staff, the packing activity of Tirumala Laddus commenced at 8am and continued till 1pm.


Speaking on the occasion, the Estates Officer said under the instructions of TTD Chairman Sri BR Naidu, EO Sri M Ravichandra and Additional EO Sri Ch Venkaiah Chowdary, over 200 women sevaks and about 100 men sevaks performed this sacred activity with utmost devotion for nearly five hours and completed the packing, lifting and dispatch of 85,000 laddus to Vontimitta on time, he added.


These laddus will be distributed to the devotees attending Sri Sita Rama Kalyanam scheduled on April 01 at Vontimitta, he maintained.


TTD Srivari Seva Sadan staff were also present

ఒంటిమిట్ట శ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం vontimitta






ఏప్రిల్ 01 తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి.


తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ - 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో  లడ్డూల ప్యాకింగ్‌ను ఆదివారం టీటీడీ ఒక బృహత్కార్యక్రమంగా నిర్వహించింది.


 లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు


తిరుమల ఎస్టేట్స్ అధికారి మరియు డిప్యూటీ ఈవో (పరకామణి ఇన్‌ఛార్జ్శ్రీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన  కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిరంతరాయంగా సాగింది.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్నాయుడుఈవో శ్రీ ఎంరవిచంద్రఅదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు సుమారు 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి దు గంటలపాటు అంకితభావంతో సేవలందించారని తెలిపారు


లడ్డూల ప్యాకింగ్లోడింగ్రవాణా వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు


 కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.