10.5.26

Tomato Upma Tasty   Breakfast | ఉడిపి స్టైల్ టమాటో ఉప్మా టేస్ట్ సూపర్ 


Tomato Upma  Tasty   Breakfast | ఉడిపి స్టైల్ టమాటో ఉప్మా టేస్ట్ సూపర్ \

SRIVARI SARE PRESENTED TO SRI TATAIAHGUNTA GANGAMMA




TTD presented the traditional Srivari Sare to Sri Tataiahgunta Gangamma Temple on Saturday evening amid devotional fervour, melam, mangala vadyams and cultural performances.


TTD Tirumala Potu AEO Sri Gundluru Muniratnam carried the sare in a grand procession from Sri Govindaraja Swamy Temple and handed it over to Temple Chairman Sri Mahesh Yadav.


The annual Gangamma Jatara, which began on May 5, will continue till May 13. As per tradition, Sri Gangamma is considered the sister of Sri Venkateswara Swamy Temple, and Srivari Sare is offered every year during the Jatara.


Tirupati MLA Sri Arani Srinivasulu, TTD Board members Sri Jyothula Nehru, Smt Panabaka Lakshmi, Smt Janakidevi, officials, employees and devotees participated in the event.

శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు ఘనంగా శ్రీవారి సారె సమర్పణ gangamma





తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు తిరుమల శ్రీవారి తరఫున శ్రీవారి సారెను శనివారం సాయంత్రం ఘనంగా సమర్పించారుసంప్రదాయబద్ధంగా మేళతాళాలు, మంగళవాయిద్యాలుకళాబృందాల ప్రదర్శనల నడుమ  కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.


టీటీడీ తిరుమల పోటు ఏఈవో శ్రీ గుండ్లూరు మునిరత్నం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ శ్రీ మహేష్ యాదవ్‌కు అందజేశారు.


మే 5 చాటింపుతో ప్రారంభమైన శ్రీ గంగమ్మ జాతర మే 13 వరకు వైభవంగా కొనసాగనుందితిరుపతి గ్రామదేవతగా పూజలందుకునే శ్రీ గంగమ్మ తల్లిని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సోదరిగా భావించే ఆనవాయితీ ఉంది సందర్భంగా ప్రతి ఏడాది శ్రీవారి ఆలయం నుండి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.


ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అర్చకులుఅధికారులు సారెను శ్రీ గోవిందరాజస్వామి లయానికి తీసుకువచ్చిఅక్కడ శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారుఅనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య శోభాయాత్రగా శ్రీ గంగమ్మ ఆలయానికి సారెను తీసుకెళ్లి ఆలయ అర్చకులకు అందజేశారు.


 కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులుటీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూశ్రీమతి పనబాక లక్ష్మీశ్రీమతి జానకీ దేవిగోవిందరాజస్వామి ఆలయం ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరిబొక్కసం ఇంఛార్జి శ్రీ గురురాజ స్వామిసూపరింటెండెంట్ శ్రీ శేషగిరిపలువురు అధికారులుఉద్యోగ సంఘాల నాయకులుఉద్యోగులుభక్తులు పాల్గొన్నారు.

SRI KALYANA VENKATESWARA SWAMY VASANTHOTSAVAMS CONCLUDE GRANDLY




The three-day Vasanthotsavams at Sri Kalyana Venkateswara Swamy Temple concluded on a grand and devotional note on Saturday amid Vedic chants, mangala vadyams and Govinda namasmarana.


As part of the festivities, Suprabhata Seva, Thomala Seva, Koluvu, Panchanga Sravanam and Sahasranamarchana were performed in the morning. Later, Asthanam was held in the Vasantha Mandapam for the processional deities of Sri Venkateswara Swamy with Sridevi and Bhudevi, Sri Sita Rama Lakshmana Anjaneya Swamy and Sri Krishna Swamy with Rukmini and Satyabhama.


Snapana Tirumanjanam was performed grandly from 1.45 pm to 3.30 pm with milk, curd, honey, coconut water, turmeric and sandal paste as per Vaikhanasa Agama traditions. Vedic hymns filled the temple premises with spiritual fervour.


In the evening, Unjal Seva will be held followed by a procession of the deities in the four mada streets.


Temple Special Grade Deputy EO Smt Varalakshmi, Superintendent Sri Ramesh Babu, Temple Inspectors Sri Muni Kumar and Sri Dhana Sekhar, priests and a large number of devotees participated.

భక్తి పరవశంలో వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు vassantotsavams




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి లయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన  వసంతోత్సవాలు శనివారం భక్తిజనసంద్రంలో ఘనంగా ముగిశాయివేదఘోషాలుమంగళవాయిద్యాలుగోవిందనామస్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.

ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభా సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగ శ్రవణంసహస్రనామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.


అనంతరం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిశ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామిరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపంలో వేంచేపు చేసి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.


మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు జరిగిన స్నపన తిరుమంజనం క్తులను మంత్రముగ్ధులను చేసిందివిష్వక్సేనారాధనపుణ్యాహవచనంరాజోపచారాల అనంతరం పాలుపెరుగుతేనెకొబ్బరినీరుపసుపుగంధంతో స్వామిఅమ్మవార్లకు మహాభిషేకం నిర్వహించారుచక్రధారశంఖధారసహస్రధారమహాకలశాభిషేకాలను వైఖానస ఆగమరీతిలో అర్చకులు ఘనంగా చేపట్టారు.


 సందర్భంగా పురుషసూక్తంశ్రీసూక్తంభూసూక్తంనీలాసూక్తంవిష్ణుసూక్తం తదితర వేదమంత్రాలు మారుమోగగా ఆలయ ప్రాంగణం దివ్యానుభూతిని కలిగించిందిఏడు రకాల సుగంధ పుష్పమాలలతో స్వామిఅమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామిఅమ్మవార్లు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీసూపరింటెండెంట్ శ్రీ రమేష్ బాబుటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్శ్రీ ధనశేఖర్ర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


SRI VEDANARAYANA SWAMY BRAHMOTSAVAMS CONCLUDE GRANDLY WITH CHANKRASNANAM



The annual Brahmotsavams of Sri Vedanarayana Swamy Temple concluded on a grand note on Saturday morning with the sacred Chakrasnanam ceremony amid devotional fervour.


As part of the festivities, Pallaki Utsavam was held from 7.30 am to 9.30 am. Later, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Vedanarayana Swamy along with Sridevi, Bhudevi and Sri Sudarsana Chakrattalwar with milk, curd, honey, coconut water, turmeric and sandal paste.


The Chakrasnanam was conducted ceremoniously in the temple pushkarini at 11.30 am, where devotees participated with devotion and received the blessings of the Lord.


Dhwajavarohanam will be held from 7.30 pm to 8 pm.


Temple Superintendent Sri Srinivasulu Reddy, Temple Inspector Sri Changal Rayulu, officials, priests and a large number of devotees participated in the event.

చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిసిన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు vedanarayanaswamy




నాగలాపురంలో జరుగుతున్న శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయిఆలయం గోవింద నామస్మరణతో మారుమోగగా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.


ఉత్సవాల్లో భాగంగా ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారుఅనంతరం ఉదయం 10.30 గంటలకు అర్చకులు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారుపాలుపెరుగుతేనెకొబ్బరినీరుపసుపుచందనాలతో విశేష అభిషేకాలు చేపట్టి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.


తదనంతరం ఉదయం 11.30 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు పవిత్ స్నానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


కాగా రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డిటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చంగల్ రాయులుఇతర అధికారులుఅర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.