12.5.26

HANUMAN JAYANTHI ON MAY 12


In connection with Hanuman Jayanti on May 12 TTD will present silk vastrams to Japali Hanuman in Tirumala.


It is a traditional practice to offer Pattu Vastrams to Sri Japali Hanuman every year on behalf of TTD during the auspicious occasion of Hanuman Jayanti.


Besides, special pujas will also be observed to Sri Bedi Anjaneya Swamy and 7th Mile Prasanna Anjaneya Swamy in Down Ghat road on that day.


TTD has also arranged free bus to transport to seventh mile and back to Tirumala on that day for the benefit of the devotees and locals.

మే 12న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు hanumath jayanti


ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఏడాది మే 12 తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది.


శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.


తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది.


సంద‌ర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ త‌ర‌పున శ్రీ జ‌పాలి హ‌నుమాన్ కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు.


కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.


11.5.26

EVERYONE SHOULD PARTICIPATE IN COW PROTECTION: TTD ADDITIONAL EO SRI CH VENKAIAH CHOWDARY 1600 TONNES OF DRY FODDER DONATED TO SV GOSHALA



TTD Additional EO Sri CH Venkaiah Chowdary said that protection of cows is a sacred service in Indian culture and everyone should take part in the cow protection movement.


On Sunday, around 1600 tonnes of dry fodder was donated to the Tirupati SV Goshala through 180 lorries under the leadership of TTD Board Member Sri Jyothula Nehru, Nehru Foundation and Srinivasa Seva Trust Chairman Sri T. Satyanarayana.


Speaking on the occasion, the Additional EO appreciated the donors for collecting fodder from Jaggampeta in Kakinada district and bearing transportation and other expenses to make such a large-scale donation for the first time. He said service activities for cow protection and dairy development are an inspiration to society.


He said the donated fodder would be supplied to TTD Goshalas located at Tirupati, Tirumala, Palamaneru and Kamalayyagaripalli near Bakarapeta. At present, a total of 2974 cows, bulls and calves are being maintained in these Goshalas.


Sri Jyothula Nehru said that while 38 lorries of fodder were donated last year, this year 180 lorries were offered. He thanked the farmers of Jaggampeta for donating the fodder free of cost. On the occasion, he also donated two cows and a calf to the SV Goshala.


TTD Board Members Smt. Panabaka Lakshmi, Smt. Janaki Devi, Sri G. Bhanu Prakash Reddy, Sri N. Sadashiva Rao, Sri Shanta Ram, Sri Darshan, SV Gosala Director Dr. AVN Sivakumar and others were present.

Rs.10 LAKHS DONATION TO BIRRD TRUST


Dr. Karumuri Srinivasulu Reddy, Chairman of Karumuri Super Speciality Hospitals, Guntur, donated Rs.10 lakhs to the BIRRD Trust on Sunday.


The donor handed over the donation DD to TTD Additional Executive Officer Sri CH Venkaiah Chowdary at Ranganayakula Mandapam in the Srivari Temple at Tirumala.


TTD Board Member Sri Nannapuneni Sadashiva Rao was also present on the occasion.

గోసంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీ గోశాలకు 1600 టన్నుల ఎండుగడ్డి విరాళం donation






 గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు.


టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ నెహ్రూ ఫౌండేషన్ రియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ టి. సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం 180 లారీల ద్వారా సుమారు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు.


సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుండి ఎండుగడ్డిని సేకరించి, స్వంత నిధులతో పాటు రవాణా ఖర్చులను భరిస్తూ ఇంత భారీ స్థాయిలో మొదటిసారిగా విరాళం అందించడం అభినందనీయమన్నారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఆదర్శమన్నారు. పురాణాలలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోసేవ సనాతన ధర్మమని పేర్కొన్నారు.


తిరుపతి ఎస్వీ గోశాలకు అందిన ఎండుగడ్డిని టిటిడి పరిధిలోని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాకారాపేట సమీపంలోని కమలయ్యగారిపల్లి గోశాలలకు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గోశాలల్లో మొత్తం 2974 గోవులు, ఎద్దులు, లేగదూడలు ఉన్నాయని వెల్లడించారు.


టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గత ఏడాది 38 లారీల ఎండుగడ్డిని అందించగా, ఈసారి 180 లారీల ఎండుగడ్డిని విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట రైతులు ఉచితంగా ఎండుగడ్డిని అందించడం గొప్ విషయమని రైతులను ప్రత్యేకంగా అభినందించారు. నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రవాణా తదితర ఖర్చులను భరిస్తూ ఎస్వీ గోశాలకు సేవ అందించామని తెలిపారు. సందర్భంగా టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ ఎస్వీ గోశాలకు రెండు గోవులు, దూడను విరాళంగా అందించారు


కార్యక్రమంలో టిటిడి బోర్డు భ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకీదేవి, శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ శాంతారామ్, శ్రీ దర్శన్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవిఎన్ శివకుమార్, ఏవీఎస్వో శ్రీ రమేష్, వైద్యులు డా. భువన, డా. అనిల్, మేనేజర్లు మృదుల, గౌరీ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

CHIEF ELECTION COMMISSIONER OF INDIA OFFERS PRAYERS IN TIRUMALA SHRINE



The Chief Election Commissioner of India Sri Gyanesh Kumar had darshan of Lord Venkateswara and offered prayers to presiding deity inside the temple on Sunday morning. 

 

At the entrance of the Srivari temple he was accorded warm welcome by the TTD Addl EO Sri Venkaiah Chowdary and temple priests.

 

Later he offered prayers to the presiding deity of Lord Venkateswara, Vakula mata, Ananda Nilayam Vimana Venkateswara, Bhashyakarla Sannidhi and Yoga Narasimha Swamy in the Sanctum Sanctorum.  After offering prayers the Vedic Pundits rendered Vedasirvachanam to the Chief Election Commissioner at Ranganayakula Mandapam. Later TTD Addl EO offered prasadams to the Chief Election Commissioner.

బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంdonation


గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి

ఆదివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.


తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డిడిని  టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.


  కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నన్నపునేని  సదాశివరావు పాల్గొన్నారు.