14.5.26

వైభవంగా రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 15న వైభవోపేతంగా కల్యాణోత్సవం rishikesh temple




హిమాలయ పర్వత శ్రేణుల నడుమ పవిత్ర గంగాతీరాన వెలసిన రిషికేష్‌ ఆంధ్రాశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మే 12 ప్రారంభమైన ఉత్సవాలు మే 16 తేదీ వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఇందులో భాగంగా మే 15 జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.


బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 13 ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మికానందాన్ని పంచారు. మే 14 ఉదయం శేషవాహనం, రాత్రి గజవాహన సేవలు నిర్వహించనున్నారు.


మే 15 ఉదయం సింహవాహన సేవ అనంతరం రాత్రి శ్రీ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. నంతరం వృషభవాహన సేవ నిర్వహిస్తారు. మే 16 ఉదయం త్రిశూలస్నానం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ధ్వజావరోహణం, రావణాసుర వాహన సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


మే 15 కల్యాణోత్సవం


బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం మే 15 సాయంత్రం 4.30 గంటలకు జరుగనుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.501/- టికెట్‌ కొనుగోలు చేసి దివ్యోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు.


సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ భక్తులను అలరిస్తున్నారు.

13.5.26

₹1.03 Cr Donation to TTD


A devotee from Mumbai, Sri Vijay Ramesh Chandra, donated Rs. 1.03 crore to the TTD run Sri Venkateswara Pranadana Trust on Tuesday.


The donor handed over the DD for the same to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the latter's Camp Office in Tirumala.

TTD Offers Pattu Vastrams to Japalai Hanuman





On the auspicious occasion of Hanuman Jayanti, TTD EO Sri Muddada Ravichandra along with the Additional EO Sri Ch. Venkaiah Chowdary offered Pattu Vastrams to Sri Anjaneya Swamy at Japali in Tirumala on Tuesday on behalf of TTD.


The temple priests welcomed the officials and arranged darshan. 


After performing special pujas to the deity, the priests honoured the EO and Additional EO with Sindhoora Vastram and offered Theertha Prasadams.


Later, the Additional EO said that offering Pattu Vastrams to Japali Hanuman on Hanuman Jayanti is a tradition of TTD. 


TTD officials also took part in this event.


Earlier, the TTD EO and   Additional EO also participated in the special Abhishekam performed to Sri Bedi Anjaneya present in front of Tirumala temple on this occasion.


జాపాలి హనుమాన్ కు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ japali hanuman




హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం ఉదయం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవోఅదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారుస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సింధూర వస్త్రంతో ఈవోఅదనపు ఈవోలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారుఆహ్లాదకరమై వాతావరణంలో తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు జరుగుతున్నాయనిభక్తులందరూ సంతోషంగా దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పారుభక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.


 కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంవీజీవో శ్రీ సురేంద్రఇతర అధికారులు పాల్గొన్నారు.


అంతకు ముందు టీటీడీ ఈఓ మరియు అదనపు ఈఓ లు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి మూలమూర్తికి జరిగి ప్రత్యేక అభిషేకంలో కూడా పాల్గొన్నారు.

Hanuman Jayanthi Celebrated Grandly in TTD Local Temples





Devotees participated in Hanuman Jayanthi celebrations with devotion and chants of Lord Rama’s name at various TTD local temples on Tuesday.


The festivities were held grandly at Sri Kodandarama Swamy Temple and Sri Govindaraja Swamy Temple in Tirupati, Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta, Sri Kodandarama Swamy Temple at Vontimitta and other affiliated temples of TTD.


Special pujas, abhishekams and Vahana Sevas were conducted on the occasion. At Tirupati Sri Kodandarama Swamy Temple, special abhishekam was performed to Sri Anjaneya Swamy and Sri Sita Rama Lakshmana Utsava deities, followed by Hanumantha Vahana Seva in the evening.


Similar special rituals and abhishekams were also held at Govindaraja Swamy Temple, Appalayagunta and Ontimitta temples amid devotional fervour.


Temple officials, priests and a large number of devotees participated in the celebrations.

స్థానిక ఆలయాల్లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు రామనామ స్మరణ, భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు local temples






తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.


శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహనసేవలు జరిగాయి.


తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో


తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.


ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం జరిగింది. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న దురు ఆంజనేయస్వామివారి ఆలయంలో దయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.


అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం జరిగింది.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో


ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సంజీవరాయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు


కార్యక్రమంలో ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Hanuman Jayanti Celebrated in Tirumala







On the auspicious occasion of Hanuman Jayanti TTD conducted special rituals on Tuesday evening at the towering idol of Sri Prasanna Anjaneya Swamy located at the 7th Mile on the first ghat road (Down Ghat) in Tirumala. 


Later, prasadam was distributed to the devotees.


TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, Dy EO Sri Lokanatham, VGO Sri Surendra, and other officials participated in the programme.


Similarly, Hanuman Jayanti celebrations were also conducted in a grand manner at various local Hanuman temples in Tirumala.