14.5.26

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తులకు వేగవంతంగా శ్రీవారి దర్శనం integrated control center





వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నప్పటికీ టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోంది.


తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసా కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహం వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.


భక్తులు ప్రాంతంలో ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూ లైన్లను సమతుల్యం చేయడం, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడం, తాగునీరు, పాలు, అన్నప్రసాదం, వైద్య సేవలు వేగంగా అందించడం వంటి చర్యలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. దీంతో దర్శన సమయ నియంత్రణలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.


ప్రత్యేకించి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని డిజిటల్ మానిటరింగ్ ద్వారా అంచనా వేసి, దానికి అనుగుణంగా భక్తులను విడతల వారీగా ముందుకు పంపించే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ భక్తులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా దర్శనానికి చేరుకుంటున్నారు.


టీటీడీ అమలు చేస్తున్న ఆధునిక ద్దీ నిర్వహణ విధానాల వల్లే క్యూలైన్లలో భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలిచిపోయే పరిస్థితులు లేకుండా, సాంకేతిక ఆధారంగా టీటీడీ యంత్రాంగం సమన్వయంతో భక్తులను వేగంగా దర్శనానికి పంపిస్తున్నారు.


టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ ధికారులు 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తున్నారు.


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై టీటీడీ ప్రత్యే దృష్టి సారించడంతో పాటు భక్తు సహకారంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత సాఫీగా కొనసాగుతోంది.


ప్రస్తుతం వేసవి రద్దీ నేపథ్యంలో శని, ఆదివారాల్లో దాదాపు 85 వేలమందికి పైగా భక్తులకు దర్శనం చేయించడం జరుగుతోంది. అదేవిధంగా సాధారణ రోజుల్లో దాదాపు 75వే మంది భక్తులకు పైగా దర్శనం చేసుకునేందుకు టీటీడీ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. మే 2 తేదిన అత్యధికంగా 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం.


తేది      2024 మే    2025 మే    2026 మే

-----------------------------------------------

మే 1      72,510     57,863     71,008

మే 2      65,313     74,344     91,005

మే 3      62,624     84,113     83,091

మే 4      77,848     83,380     70,996

మే 5      81,927     65,095     76,240

మే 6      76,748     69,214     71,029

మే 7      65,146     71,001     70,001

మే 8      64,766     64,850     67,222

మే 9      65,508      6,821     81,512

మే 10     60,545     85,078     85,942

మే 11     76,945     80,423     78,985

మే 12     80,001     68,760     80,389

-----------------------------------------------

మొత్తం   8,49,881   8,10,942   9,27,420

Do Not Belive Rumours on Srivani Darshan Tickets - TTD




TTD has appealed to the devotees not to fall prey to misconceptions arising from certain reports being circulated recently in some newspapers and on social media platforms regarding the booking of SRIVANI Trust tickets.


TTD introduced the SRIVANI Trust ticket booking system in May 2019. 


Based on the shortcomings observed in the earlier system and the suggestions and feedback received from devotees, TTD significantly strengthened the SRIVANI ticket booking process from June 2024 onwards to provide transparent and secured services to devotees.


It is not possible to hack the SRIVANI ticket booking website or intrude into the system under any circumstances. 


However, some brokers are attempting to misuse advanced technology such as AI-based auto-filling and auto-copying methods to rapidly enter details and book tickets.


TTD’s technical team is continuously monitoring such suspicious activities, identifying related IDs and illegal booking methods, and immediately blocking them. The software is also being updated regularly to strengthen security measures.


Similarly, strict action is being taken against those middlemen who are misleading devotees and selling fake tickets.


Further, the advance booking software has been developed on a “first come, first served” basis. In case a ticket booking fails for any reason or if there is a failure at the payment gateway during the transaction, the tickets automatically become available again for devotees.


TTD once again appeals to its devotees to book tickets only through the official TTD website and not to trust middlemen.

శ్రీవాణి దర్శన టికెట్లపై అపోహాలను నమ్మకండి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి srivani




ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


టీటీడీ శ్రీవాణి ట్రస్టు టికెట్ బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు మధ్యవర్తుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది.


అందులోని లోటుపాట్లను మరియు భక్తుల నుండి వచ్చిన సూచనలు, సలహాల మేరకు 2024 సంవత్సరం జూన్ నుండి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించడం జరిగింది.


శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. భక్తులు అపోహలకు గురి కావద్దు. అయితే కొందరు దళారులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.


ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను టీటీడీ సాంకేతిక విభాగం ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత డీలు మరియు అక్రమ బుకింగ్ విధానాలను వెంటనే నిరోధించి తదనుగుణంగా సాప్ట్ వేర్ ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిరంతర నిఘా ఉంచడం జరుగుతోంది.


అదేవిధంగా కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టికెట్లను విక్రయిస్తున్న నిందితులపై కూడా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.


అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ సాప్ట్ వేర్ ను ముందు వచ్చిన వారికి ముందు బుక్ చేసుకునే విధానంలో అభివృద్ధి చేయడం జరిగింది. బుకింగ్ సమయంలో ఏదైనా కారణంగా టికెట్ బుక్ కాకపోయినా లేదా నగదు చెల్లింపులో లోపం తలెత్తితే వెంటనే టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చేలా అప్లికేషన్ పని చేస్తోంది


భక్తులు కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ మరియు అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Grand Annual Brahmotsavams of Sri Chandra Mouleswara Swamy Vari Temple at Rishikesh




Annual Brahmotsavams of Lord Sri Chandramouleeswara Swamy are being celebrated grandly at the Andhra Ashram temple in Rishikesh on the banks of the holy Ganga amidst the Himalayas.


The celebrations commenced on May 12 and will conclude on May 16. Special arrangements have been made for the grand Kalyanotsavam to be held on May 15 at 4.30 PM.


As part of the festivities, devotees witnessed Surya Prabha Vahanam in the morning and Chandra Prabha Vahanam in the evening on May 13. Various spiritual, devotional and cultural programmes are also being organised daily by TTD projects.