22.5.26

తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ rush






వేస‌వి ర‌ద్దీ నేప‌థ్యంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేప‌థ్యంలో గురువారం తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొన‌డంతో భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది.


భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్  వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.


ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.


టీటీడీ అన్న ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా తాగునీరు, అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉద‌యం అల్పాహారంగా పాలు ఉప్మా, పొంగ‌ల్‌, మ‌ధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర‌, ట‌మోట రైస్‌,  రాత్రి పాలు ఉప్మా, సాంబార‌న్నం భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంది.


అదేవిధంగా టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేయడం జరుగుతోంది.


ర‌ద్దీకి అనుగుణంగా ఔట‌ర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబ‌డి ఒక మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది.


తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు నిర్మిచబడ్డాయి. దీంతో 60వేల మంది భ‌క్తుల‌కు మించి తిరుమ‌ల‌లో వ‌స‌తి కేటాయించడానికి వీలుప‌డ‌దు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో దాదాపు 7500 గ‌దులు, ఐదు యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. గ‌దులు పొంద‌లేని భ‌క్తులు తిరుమ‌ల‌లోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (ప‌ద్మ‌నాభ నిల‌యం), పీఏసీ-5 ల‌లో ఉన్న దాదాపు తొమ్మిదివేల‌ లాక‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా భ‌క్తుల‌తో కిక్కిరిసి ఉన్నాయి.


తిరుమ‌ల‌లో భ‌క్తులు స్వామివారికి త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ కోసం భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందులో ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తో 11 మినీ క‌ల్యాణ క‌ట్ట‌లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. నిరంత‌రాయంగా క్షుర‌కులు భ‌క్తుల‌కు సేవ‌లు అందిస్తున్నారు


గ‌త ఐదు రోజుల్లోనే 4,32,213 మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం విశేషం. ఇందులో అత్య‌ధికంగా మే 16, 17 తారీఖుల్లో 90 వేల‌కు పైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం జ‌రిగింది. అదేవిధంగా గ‌త ఐదురోజుల్లో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల సంఖ్య కూడా విప‌రీతంగా పెరిగింది. అత్య‌ధికంగా మే 18, 19, 20 తారీఖుల్లో 43 వేల‌కు పైగా భ‌క్తులు స్వామివారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డం విశేషం. అదేవిధంగా గ‌త ఐదురోజుల్లో తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 ల‌క్ష‌ల‌కు పైగా భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు, టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ అందించ‌డం జ‌రిగింది.


వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్న ప్ర‌సాదాలు, పరిశుభ్రత, వ‌స‌తి, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ల‌డ్డూలు వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడం కోసం టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోంది.


గ‌త ఐదు రోజుల్లో న‌మోదైన భ‌క్తుల ర‌ద్దీ గ‌ణాంకాలు (సంఖ్య‌ల్లో)

---------------------------------------------

తేది  -  ద‌ర్శ‌నాలు - త‌ల‌నీలాలు - అన్న ప్ర‌సాదాలు

------    -------------     ----------           ------------------

మే 20  - 86,315  -  44,107   -     3,99,380

మే 19  - 84,412  -  43,032   -     4,03,810

మే 18  - 80,455  -  43,309   -     3,42,670

మే 17  - 91,020  -  35,193   -     3,81,210  

మే 16  - 90,011  -  39,083   -     4,20,085


కాగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది  దర్శన క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు 

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా

శ్రమిస్తున్నారు.

TTD JEO Inspects Ghee Production Centre Works at SV Goshala




TTD JEO (Health & Education) Dr. A. Sarath inspected the ongoing works of the Ghee Production Centre and Centre of Excellence at SV Gosala, Tirupati on Wednesday.


He directed officials to complete the pending works by July-end as per the instructions of TTD EO Sri M. Ravichandra. The unit is being developed to process 2,000 litres of milk daily and produce milk, curd and ghee for Srivari rituals and services.


The JEO said 90 percent of the ghee plant works have been completed and instructed officials to conduct trial runs and expedite infrastructure facilities. He also said the unit can produce around 80 kg of ghee per day, with plans to enhance the capacity further.


SV Gosala Director Dr. AVN Sivakumar and other officials were present.

ఎస్వీ గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం పనుల పరిశీలన ghee production





తిరుపతిలోని టిటిడి ఎస్వీ గోశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. . రత్ బుధవారం పరిశీలించారు.


సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర దేశాల మేరకు పెండింగ్ పనులను సమీక్షించామని తెలిపారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను మరియు చివరి దశలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం పెండింగ్ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను దేశించారు. ఎస్వీ గోశాలలో  రోజుకు సుమారు 2 వేల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్వీ గోశాల నుండి సేకరించే పాలను వినియోగించి స్వామివారి కైంకర్యాలు, సేవల కోసం పాలు, పెరుగు, నెయ్యి తదితర ఉత్పత్తులను టిటిడి స్వయంగా తయారు చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.


అదేవిధంగా, నెయ్యి తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి మిగిలిన పనులను  పూర్తి చేయాలని సూచించారు. పాలు ఇచ్చే దేశీయ ఆవులను మరింతగా సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని, టిటిడి తరఫున చేపట్టాల్సిన నీరు, విద్యుత్, ఫ్యాన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, సైన్ బోర్డులు తదితర మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మజ్జిగ, వెన్న తయారీ అనంతరం వెన్న నుండి నెయ్యి ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారి ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలకు వినియోగించే నెయ్యిని ఎస్వీ గోశాల నుండే సరఫరా చేసేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


యూనిట్ ద్వారా రోజుకు 2 వేల లీటర్ల పాల నుండి సుమారు 80 కిలోల నెయ్యి తయారు చేసే అవకాశం ఉందని, దశలవారీగా యూనిట్ సామర్థ్యాన్ని 10 వేల లీటర్ల వరకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జేఈవో వెల్లడించారు.


కార్యక్రమంలో టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈ శ్రీ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

21.5.26

Chiranjeevi's158th Movie Launched with Pooja