5.6.26

₹20 Lakh Donated to SV Annaprasadam Trust




A donation of Rs.20 lakh was received by the SV Annaprasadam Trust on Thursday.


Hyderabad-based donors Mr. Sanjay Babu and Mr. Harshavardhan Babu, Chairman of Homipets, donated Rs.10 lakh each.


The donation cheques were handed over to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.


The Chairman thanked the donors for their generous contribution and wished them the blessings of Lord Venkateswara.


TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao was also present.

Grand Rathotsavam of Sri Kalyana Venkateswara Swamy Held Amid Devotional Fervour


The annual Brahmotsavams of Sri Padmavati Sameta Sri Kalyana Venkateswara Swamy at Narayanavanam witnessed a grand Rathotsavam on Thursday morning.


Amid chants of “Govinda... Govinda...”, Vedic hymns and bhajans, devotees enthusiastically pulled the majestic temple chariot carrying the processional deities of the Lord along the four Mada Streets.


The temple atmosphere reverberated with devotion as thousands of devotees participated in the sacred event.


As part of the Brahmotsavams, Aswa Vahana Seva will be held on Thursday evening, while Chakrasnanam and Dwajavarohanam on June 5 will mark the conclusion of the festivities.


TTD officials, temple priests, police, vigilance staff and a large number of devotees participated.

భక్తి పారవశ్యంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం rathotsavam






నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, జనలు, వేదఘోషల మధ్య స్వామివారి రథయాత్ర సాగింది.


ఉదయం 7.45 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు మహారథాన్ని అధిష్ఠించి నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల కీర్తనలు, నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి.


గోవిందా... గోవిందా...” అనే భక్తినినాదాల మధ్య భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కటాక్షాన్ని పొందారు. రథం యథాస్థానానికి చేరుకున్ అనంతరం వేదపారాయణం, దివ్యప్రబంధ పఠనం, శాత్తుమొర నిర్వహించి మహాహారతి సమర్పించారు.


రథోత్సవం తెలిపే ఆధ్యాత్మిక సందేశం


రథోత్సవం ఆత్మానాత్మ వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది. శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, ఆత్మ రథికుడనే ఉన్నత తాత్త్విక భావనను ఉత్సవం భక్తులకు బోధిస్తుంది.


నేడు అశ్వవాహన సేవ


బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సే నిర్వహించనున్నారు.


రేపటి కార్యక్రమాలు


తొమ్మిదవ రోజు శుక్రవారం ఉదయం 7 గంటల నుండి పల్లకీ ఉత్సవం, ఉదయం 9.15 గంటల నుండి చక్రస్నానం, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి ఇవ్వనున్నారు.


కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్ రాయులు, శ్రీ నాగరాజు, అర్చకులు, పోలీసులు, విజిలెన్స్ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు aswa vahanam




నారాయణ వనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి 7 గంట‌లకు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.


వాహనం ముందు భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై  కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూకలిదోషాలకు దూరంగా ఉండాలని నా సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.


వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ నాగరాజు,  శ్రీ చెంగల్ రాయులు, విశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.


Sri Kalayana Srinivasa Swamy Varu Blesses Devotees on Aswa Vahanam


As part of the annual Brahmotsavams at Narayanavanam, Sri Kalyana Venkateswara Swamy appeared in Kalki Alankaram on Ashwa Vahanam on Thursday evening, blessing devotees. The procession was held amidst devotional fervour with bhajans, Kolatam performances, and mangala vadyams. 


Temple officials and a large number of devotees participated.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం donation




ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు గురువారం విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన దాతలు శ్రీ సంజ‌య్ బాబు రూ.10 లక్షలు, హోమిపెట్స్ అధినేత శ్రీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ బాబు రూ.10 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.


ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని టిటిడి ఛైర్మ‌న్ క్యాంప్ కార్యాల‌యంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు అందజేశారు.


ఈ సందర్భంగా దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 


ఈ కార్యక్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ న‌న్న‌ప‌నేని స‌దాశివ‌రావు పాల్గొన్నారు.  


ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం donation




టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.

తమ మనవరాలు చి. కుప్పాల దర్శన పేరుతో అందించిన ఈ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి గురువారం సమర్పించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవో చి. దర్శనను ఆశీర్వదించి, సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఉదారంగా విరాళం అందించిన శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులను అభినందించారు.

టీటీడీ చేపడుతున్న వైద్య, మానవతా సేవలకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం మరెందరికో ప్రాణదానంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.