13.6.26

సూర్యప్రభపై తేజోమయంగా భక్తులను కటాక్షించిన శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ వైభవంతో భక్తి పారవశ్యంలో మునిగిన కార్వేటినగరం




కార్వేటినగరం శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయానుగ్రహాలు ప్రసాదించారు. గ్రామ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.


జగత్తుకు చైతన్యప్రదాత సూర్యనారాయణుని మహిమ


సూర్యుడు తేజోనిధి, సకల జీవరాశులకు ప్రాణాధారం. వర్షాలు, పంటలు, ఔషధాలు, ప్రకృతిలోని సమస్త చైతన్యానికి మూలకారణమైన సూర్యతేజస్సుకు ప్రతీకగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వడం విశేష ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.


రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి అనుగ్రహం


బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.


జూన్ 13 రథోత్సవం


వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం 7.30 గంటలకు శ్రీ రుక్మిణిసత్యభామ సమే శ్రీ వేణుగోపాలస్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రథంపై గ్రామ వీధుల్లో విహరించి స్వామివారు భక్తులకు దివ్య ర్శనమివ్వనున్నారు.

అదే రోజు రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.


వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

AP High Court CJ Offers Prayers in Tirumala Temple









The Chief Justice of the Andhra Pradesh High Court, Justice Lisa Gill, offered prayers to Sri Venkateswara Swamy at Tirumala temple on Friday.


Upon her arrival to the temple, she was received by TTD Executive Officer Sri Muddada Ravichandra, Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary, and CVSO Sri Muralikrishna.


Temple priests accorded her the traditional Istikapal welcome.


After the darshan, Vedic scholars rendered Vedasirvachanam at the Ranganayakula Mandapam. 


The EO and Additional EO presented her Theertha Prasadams and the laminated photo frame of Sri Venkateswara Swamy.


Temple Dy EO Sri Lokanatham and other officials were also present on the occasion.

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ap cj








ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ ఆహ్వానించగా, అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.


దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందించగా ఈవో, అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Arogyananada Program Receives Enthusiastic Response




The "Yoga–TTD Arogyananda" program being organized by TTD has been receiving an encouraging response from employees, students and retired staff.


Yoga training is being conducted daily at 17 centres in Tirupati from June 7 to 21 under the supervision of TTD JEO Dr. A. Sarat. The 14-day initiative aims to promote physical fitness, mental well-being and a healthy lifestyle.


As part of the International Yoga Day celebrations, yoga competitions will be held from June 18 to 20, while grand celebrations are being planned on June 21 at the Parade Grounds of the TTD Administrative Building.


The programme is being coordinated by the TTD Social Welfare Department. 


AP High Court Chief Jutice Visit Sri Padmavati Ammavari Temple






Andhra Pradesh High Court Chief Justice Justice Lisa Gill offered prayers at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on Friday.


TTD JEO Dr. A. Sarath and temple priests received the Chief Justice and arranged her darshan. She was later presented with Theertha Prasadam.


Earlier, Justice Lisa Gill also visited Sri Kapileswara Swamy Temple in Tirupati and offered prayers.


Deputy EOs Sri Harindranath, Smt. Nagaratna, VGO Sri Giridhar, and other officials were present.

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే apcj






ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.


ముందుగా ఆలయానికి విచ్చేసిన గౌరవ ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. . శరత్, ఆలయ అర్చకులు  స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.


శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సీజే 


అంతకుముందు జస్టిస్ లీసా గిల్ తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకోగానే సీజేకు టీటీడీ జేఈవో డా. . శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శ ఏర్పాట్లు చేశారు.


కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీమతి నాగరత్న, విజిఓ శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.