14.6.26

గోవిందనామ స్మరణల మధ్య వైభవోపేతంగా శ్రీ వేణుగోపాలస్వామివారి రథోత్సవం





కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం దయం నిర్వహించిన రథోత్సవం అత్యం వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాద్యాలు, భజన బృందాల కీర్తనల మధ్య స్వామివారు దివ్య రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు మంగళ దర్శనం ప్రసాదించారు.


ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగగా, అడుగడుగునా కర్పూర హారతులతో స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనలతో గ్రామమంతా ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేదపారాయణం, ప్రబంధ పఠనం, శాత్తుమొర, హారతి కార్యక్రమాలు నిర్వహించారు.


రథోత్సవం చాటిచెప్పే ఆత్మతత్త్వ సందేశం


వేదాంత దృష్టిలో ఆత్మనే రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులుగా భావిస్తారు. ఈ రథోత్సవం ద్వారా శరీరానికి అతీతమైన ఆత్మస్వరూపాన్ని గ్రహించి ఆత్మానాత్మ వివేకాన్ని పెంపొందించుకోవాలనే గొప్ప తాత్త్విక సందేశాన్ని స్వామివారు భక్తులకు అందిస్తున్నారు.


 సాయంత్రం అశ్వవాహన సేవ


బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి అశ్వవాహన సేవ భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు.


ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


జూన్ 14 చక్రస్నానంధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు


బ్రహ్మోత్సవాల చివరి రోజైన జూన్ 14 ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ధ్వజావరోహణం జరగడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

జూన్ 25 నుండి 29 వరకు వైభవోపేతంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు teppotsavams




తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29 తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ అలమేలుమంగ తల్లి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.


పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే మహోత్సవాల్లో ద్మసరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే తెప్పోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భక్తుల కష్టాలు, సంసార బంధనలు తొలగి దైవానుగ్రహం, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ ప్రాశస్త్యం.


పద్మసరస్సులోని బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను వసాగరంలో మునిగిపోకుండా రక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు చాటిచెబుతాయి.


ఉత్సవాల విశేషాలు


జూన్ 25: రుక్మిణి, సత్యభామ సమే శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం


జూన్ 26: శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం


జూన్ 27 నుండి 29 వరకు: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం


చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.


అలాగే జూన్ 28 తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29 తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ వైభవంగా జరుగనున్నాయి. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు.


ఆర్జిత సేవలు రద్దు


తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అలాగే జూన్ 26 జరిగే లక్ష్మీపూజలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.


ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు


సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నారు.


అలమేలుమంగ తల్లి దివ్య కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది.

జూన్ 25 నుండి జూలై 3 వరకు వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు prasanna venkateswara swamy varu




అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడాది జూన్ 25 నుండి జూలై 3 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.


ఉత్సవాలకు ముందుగా జూన్ 23 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 24 సాయంత్రం అంకురార్పణ ఘనంగా రగనున్నాయి.


వాహనసేవల్లో భక్తులకు దివ్య దర్శన భాగ్యం


బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.


వాహనసేవల విశేషాలు


జూన్ 25 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం

జూన్ 26 – చిన్నశేష వాహనం, హంస వాహనం

జూన్ 27 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

జూన్ 28 – కల్పవృక్ష వాహనం, కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

జూన్ 29 – మోహినీ అవతారం, గరుడ వాహనం

జూన్ 30 – హనుమంత వాహనం, గజ వాహనం

జూలై 1 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

జూలై 2 – రథోత్సవం, అశ్వవాహనం

జూలై 3 – చక్రస్నానం, ధ్వజావరోహణం


జూన్ 28 స్వామివారి కల్యాణోత్సవం


జూన్ 28 తేదీ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేయనున్నారు.


ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు 


బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ మ్యూజిక్ కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనున్నారు.


భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.

Sri Periyalwar Utsavam from 16th to 25th June




The annual Sri Periyalwar Utsavam will be observed with religious fervour from June 16 to 25 at Sri Lakshmi Narayana Swamy Temple, attached to Sri Govindaraja Swamy Temple, Tirupati.


During the festivities, HH Pedda Jeeyar Swamy and HH Chinna Jeeyar Swamy, along with their disciples, will recite Divya Prabandham Pasurams every morning and evening before Sri Periyalwar.


On June 25, Tirumanjanam will be performed to Sri Periyalwar in the morning. In the evening, Sri Govindaraja Swamy on Garuda Vahanam and Sri Periyalwar on Gaja Vahanam will bless devotees in a procession through the four Mada Streets.


Sri Periyalwar is revered as a great devotee of Lord Mahavishnu and the father of Sri Andal.

Truck Donated to TTD




Leading automobile company, Ashok Leyland Limited, donated a truck worth Rs.31,72,532 to TTD on Saturday.


On this occasion, Sri Sanjeev Kumar, the President of the Company, offered special prayers for the vehicle in front of Sri Venkateswara Swamy Temple at Tirumala and formally handed over the truck keys to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary.


TTD Transport In-charge General Manager Smt Lakshmi Prasanna and Tirumala DI Sri Krishnaiah were also present.