16.6.26

Grand 20th Annual Brahmotsavams at SV Temple, Himayathnagar




TTD has made elaborate arrangements for the 20th Annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, Himayat Nagar, Hyderabad, from June 19 to 24.


The festivities will commence with Ankurarpanam on June 19 and conclude with Dhwajarohanam, various Vahana Sevas, Sri Vari Shanti Kalyanam, Rathotsavam, Snapana Tirumanjanam, Chakrasnanam, Pushpayagam and Dhwajavarohanam on June 24.


Special arrangements, including drinking water facilities, shamianas and decorative illumination, have been made for the convenience of devotees.


TTD has invited devotees to participate in the divine festivities and seek the blessings of Lord Venkateswara.

కేంద్ర మంత్రి సమక్షంలో సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ చారిత్రాత్మక ఒప్పందం mou


శ్రీవారి ప్రసాదా తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని రిరక్షించేందుకు టీటీడీ, మైసూరుకు చెందిన CSIR-Central Food Technological Research Institute తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.


బెంగళూరులో నిర్వహించిన రెండు రోజుల RISE Conclave-2026 (Reasearch, Innovation, Start-ups And Entrepreneurship) సదస్సులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, హార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఒప్పందం జరిగింది. సదస్సులో టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జీఎం శ్రీ ఉమా శంకర్ పాల్గొన్నారు. కాగా, దేశంలోని దేవాలయాలకు సంబంధించి తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం.


సందర్భంగా కేంద్ర మంత్రి పరిశోధనలు, ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని, తయారీ సామర్థ్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.


ఒప్పందం ద్వారా కలిగే ప్రయోజనాలు


•  నాణ్యత, భద్రతకు మరింత ప్రాధాన్యం:


ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు కఠినమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక విధానాలు అమలు చేస్తారు.


•  ఆధునిక నిల్వ, పరీక్షా వ్యవస్థలు:


నిల్వ, కొనుగోలు, పరీక్షల ప్రక్రియల్లో శాస్త్రీయంగా నిర్ధారిత సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి కలుషిత ప్రమాదాలను తగ్గిస్తారు.


•  ప్రసాదాల నిల్వ కాలం పెంపు:


రుచి, నాణ్యత, సంప్రదాయ విలువలకు భంగం కలగకుండా ప్రసాదాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజింగ్, పరిశోధన చర్యలు చేపడతారు.


•  సిబ్బందికి ప్రత్యేక శిక్షణ:


టీటీడీ ఆహార విశ్లేషకులు, సంబంధిత సిబ్బందికి ఆధునిక పరీక్షా విధానాలు, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తారు.


•  శాస్త్రవేత్తల ప్రత్యక్ష సహకారం:


సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు.


ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు భక్తులకు మరింత విశ్వసనీయమైన సేవలు అందించే అవకాశం కలుగనుంది.


హిమయత్‌నగర్ ఎస్వీ ఆలయంలో వైభవంగా 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుండి 24 వరకు దివ్యోత్సవాల మహోత్సవం భక్తుల కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు himayatnagar




హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 20 వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జూన్ 19 అంకురార్పణతో ప్రారంభమయ్యే దివ్యోత్సవాలు జూన్ 24 ధ్వజావరోహణంతో ఘనంగా ముగియనున్నాయి.


అంకురార్పణధ్వజారోహణంతో ఉత్సవారంభం


జూన్ 19 సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.45 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 20 ఉదయం 6.35 గంటల నుండి 9 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది.


ఆధ్యాత్మిక వైభవాన్ని చాటనున్న వాహన సేవలు


జూన్ 20

ఉదయం 10 నుండి 11 గంటల వరకుశేషవాహనం

రాత్రి 8 నుండి 9 గంటల వరకునుమంత వాహనం


జూన్ 21

ఉదయం 8.30 గంటలకుసూర్యప్రభ వాహనం

రాత్రి 8 గంటలకుచంద్రప్రభ వాహనం


జూన్ 22

ఉదయం 8.30 గంటలకుగజవాహనం

ఉదయం 10.30 గంటలకుశ్రీవారి శాంతి కల్యాణం

రాత్రి 8 గంటలకుగరుడవాహనం


జూన్ 23

ఉదయం 8.30 గంటలకురథోత్సవం

రాత్రి 8 గంటలకుఅశ్వవాహనం


జూన్ 24

ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకుస్నపన తిరుమంజనం, చక్రస్నానం

సాయంత్రం 6 గంటలకుపుష్పయాగం

రాత్రి 9 గంటలకుధ్వజావరోహణం


భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు


వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం చలువ పందిళ్లు, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, ఇతర మౌలిక వసతులను టీటీడీ ఏర్పాటు చేసింది.


శ్రీవారి కృపాకటాక్షాలకు ఆహ్వానం


దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులను ఆహ్వానిస్తోంది.

Jyestabhishekam from 26th June to 28th June




The Salakatla Jyeshtabhishekam will be held at the Srivari Temple in Tirumala from June 26 to 28.


Every year, in the month of Jyeshta, the celestial Jyeshtabhishekam which is also known as Abhidyeyaka Abhishekam, is performed for three days concluding on the day of the advent of Jyeshta Nakshatra. 


This ritual, which is performed in the Kalyana Mandapam of Sampangi Prakaram.


Significance:


This festival is usually observed to protect the ancient ceremonial idols of the deities from wear and tear due to the Abhishekams performed over generations. 


Different Armours:


On the first day, the golden armour of Sri Malayappa Swamy is removed, and homas, abhishekams and Panchamrutha Snapana Tirumanjanam are performed.  


After that, Sri Malayappa Swami is adorned with a diamond armour. On the second day, a pearl armour is decked. On the third day, the deity is adorned with the gold armour again. 


Once in a year:


This gold armour is taken off again next year during the time of Jyeshtabhishekam only. Until then, utsava deity participates in various festivals in the gold armour throughout the year.


Sevas Cancelled:


In view of the Srivari Jyeshtabhishekam, TTD has cancelled the Arjita Sevas including Kalyanotsavam, Unjal Seva, and Arjita Brahmotsavam on June 28.

15.6.26

తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం blood donation day



ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.


ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 52 మంది భక్తులు క్తదానం చేశారు.


కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌరి, హెడ్ నర్స్ శ్రీమతి పుష్ప, బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ నర్స్ శ్రీమతి విజయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ కోదండపాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

World Blood Donors Day Observed in Tiurmala







On the occasion of World Blood Donor Day, devotees voluntarily came forward to donate blood at Ashwini Hospital in Tirumala on Sunday.


A total of 52 devotees donated blood between 10 AM and 2 PM.


Ashwini Hospital Medical Superintendent Dr. Subba Reddy, Blood Bank Medical Officer Dr. Gowri, Head Nurse Smt Pushpa, Blood Bank Staff Nurse Smt Vijayalakshmi, Lab Technician Sri Kodandapani, and other staff members participated in the programme.

Sri Venugopala Swamy Vari Brahmotsavams Conclude with Dhawavarohanam



The nine-day annual Brahmotsavams of Sri Venugopalaswamy, along with Sri Rukmini and Sri Satyabhama, at Karvetinagaram concluded grandly on Sunday evening with the Dhwajavarohanam ceremony.


The ritual was performed at 5.30 p.m. amidst Vedic chanting and mangala vadyams. As part of the ceremony, the Garuda flag was lowered, marking the ceremonial farewell to the deities invited during Dhwajarohanam.


According to temple tradition, devotees participating in the Brahmotsavams are blessed with prosperity, health, and spiritual merit.


Temple Superintendent Sri Srinivasulu Reddy, Temple Inspector Sri Chengalrayulu, priests, and officials participated.