17.6.26

శ్రీలక్ష్మీనారాయణ సన్నిధిలో వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం sri periyalvar utsavas


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారాయణస్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాలు జూన్ 25 తేదీ వరకు క్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి.


ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వార్ సన్నిధిలో దివ్యప్రబంధ పాశురాలను భక్తిపూర్వకంగా నివేదించి ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లారు.


శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు, శ్రీ ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన శ్రీ పెరియాళ్వార్ తులసీమాలలను స్వయంగా తయారు చేసి ప్రతిరోజూ స్వామివారికి సమర్పించేవారని, ఆయన రచించిన పాశురాలు నేటికీ వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచాయని అర్చకులు వివరించారు.


ఉత్సవాల చివరి రోజైన జూన్ 25న ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించనున్నారు.


ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఇతర అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


Koil Alwar Tirumanjanam Performed at Hiyamath Nagar SV Temple





As a prelude to the Annual Brahmotsavams scheduled from June 20 to 24, Koil Alwar Thirumanjanam was performed with religious fervour at Sri Venkateswara Swamy Temple, Himayat Nagar, Hyderabad, on Tuesday.


The sacred cleansing ritual commenced after Suprabhata Seva, Thomala Seva, Koluvu, and Panchanga Sravanam. The temple premises and puja articles were purified, followed by the sprinkling of a holy aromatic mixture prepared with traditional ingredients across the temple, creating a spiritually vibrant atmosphere.


Devotees were allowed for darshan from noon onwards.


Temple AEO Sri Ramesh, Temple Inspector Sri Srinivasa Manikantha, priests, and staff participated in the programme.

Annual Brahmotsavams of Lord Venkateswara Swamy Varu At Kuruskhetra from 25th June to 3rd July




The annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple at Kurukshetra, Haryana, will be celebrated with religious fervour from June 25 to July 3, 2026. Ankurarpanam will be held on June 24.


As a prelude to the festivities, Koil Alwar Thirumanjanam will be performed on June 19. The nine-day festival will feature daily Vahana Sevas, Kalyanotsavam on June 29, Rathotsavam on July 2, and conclude with Chakrasnanam and Dwajavarohanam on July 3.


Pushpayagam will be observed on July 4. TTD has invited devotees to participate in large numbers and seek the divine blessings of Lord Venkateswara.

హిమయత్‌నగర్ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం himayath nagar temple





హైదరాబాద్‌ హిమయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. జూన్ 20 నుండి 24 తేదీ వరకు జరగనున్న 21 వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.


సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాం శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా సాగింది.


ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజాసామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.


మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.


కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ మేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాస మణికంఠ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




ఒంగోలుకు చెందిన విజన్ ఆటోమొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది


మేరకు సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

ధర్మక్షేత్రం కురుక్షేత్రలో జూన్ 25 నుండి జూలై 3 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు haryana temple




హర్యానా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 25 నుండి జూలై 3 తేదీ వరకు అత్యం వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందుగా జూన్ 24 సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా జూన్ 19 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.


బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు


జూన్ 25 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం

ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం నిర్వహించి, సాయంత్రం పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.


జూన్ 26 – చిన్నశేష వాహనం, హంస వాహనం

ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంస వాహనంపై స్వామివారి దివ్య విహారం జరుగుతుంది.


జూన్ 27 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహన సేవలు నిర్వహిస్తారు.


జూన్ 28 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం

భక్తుల కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనం, అనంతరం సర్వభూపాల వాహన సేవలు జరుగుతాయి.


జూన్ 29 – మోహినీ అవతారం, కల్యాణోత్సవం, గరుడ వాహనం

ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు దర్శనమివ్వగా, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం గరు వాహన సేవ జరుగుతుంది.


జూన్ 30 – హనుమంత వాహనం, గజ వాహనం

ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.


జూలై 1 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై దివ్య దర్శనం కల్పిస్తారు.


జూలై 2 – రథోత్సవం, అశ్వ వాహనం

భక్తుల గోవిందనామ స్మరణల మధ్య థోత్సవం నిర్వహించి, రాత్రి అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తారు.


జూలై 3 – చక్రస్నానం, ధ్వజావరోహణం

పవిత్ర చక్రస్నానంతో పాటు ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.


జూలై 4 పుష్పయాగం


బ్రహ్మోత్సవాల అనంతరం జూలై 4 సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల రకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.


భక్తులకు ఆహ్వానం


బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టిటిడి కోరుతోంది.