3.6.26

Kalyana Venkateswara Swmay Varu Gloriously Rides Gaja Vahanam in Srinivasa Darbar Alankaram




As part of the annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Narayanavanam, the Lord blessed devotees on Tuesday evening on Gaja Vahanam in the majestic Srinivasa Darbar Alankaram.


The Gaja Vahana Seva signifies the Lord's assurance of protection to devotees, recalling the divine rescue of Gajendra by Lord Mahavishnu. Devotees witnessed the grand procession amid a spiritually vibrant atmosphere.


On June 3, the Lord will bless devotees on Surya Prabha Vahanam in the morning and Chandra Prabha Vahanam in the evening.


Tirumala Bokkasam In-charge Sri Gururaja Swamy, Nagalapuram temple superintendent Sri Srinivasulu Reddy, Temple Inspectors Sri Nagaraju and Sri Chengalrayulu, temple priests, officials, Srivari Sevaks and a large number of devotees were present.

గజవాహనంపై శ్రీనివాస దర్బార్ అలంకారంలో కల్యాణ వేంకటేశ్వరుని దివ్య రాజసం gaja vahanam






నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి స్వామివారు శ్రీనివాస దర్బార్ అలంకారంలో గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.


గజవాహనంపై రాజసంగా విహరించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఆధ్యాత్మి వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్నాయి.


గజేంద్ర మోక్షాన్ని స్మరింపజేసి గజవాహన సేవ


ఆర్తత్రాణ పరాయణుడైన భగవంతుడు క్తుల పిలుపుకు వెంటనే స్పందించి రక్షిస్తాడనే సందేశాన్ని గజవాహనోత్సవం తెలియజేస్తుంది. సర్వం విడిచి తననే శరణు వేడిన గజేంద్రుడిని రక్షించినట్లే, తనను విశ్వసించి శరణాగతి పొందిన భక్తులందరికీ అభయాన్ని ప్రసాదిస్తాననే దివ్య సందేశాన్ని స్వామివారు గజవాహన సేవ ద్వారా అందించారు.


3 తేదీన సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు


బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన బుధవారం ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Gold Ornaments Worth ₹33 Lakh Offered to The Deity


As part of the annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Narayanavanam, gold ornaments worth Rs.33 lakh were presented to Sri Kalyana Venkateswara Swamy from the Tirumala temple. The offerings included a two-layer gold necklace studded with Navaratna beads, Seema Kamalams and a gold Lakshmi Kasula Mala. Tirumala Temple Deputy EO Sri Lokanatham handed over the ornaments to Narayanavanam Temple Deputy EO Smt. Nagaratna. The ornaments were later taken in a ceremonial procession and adorned to the deity after special rituals.


Tirumala Bokkasam In-charge Sri Gururaja Swamy, Nagalapuram temple superintendent Sri Srinivasulu Reddy, Temple Inspectors Sri Nagaraju and Sri Chengalrayulu, temple priests, officials, Srivari Sevaks and a large number of devotees were present.

కల్యాణ శ్రీనివాసుడికి రూ.33 లక్షల విలువైన స్వర్ణాభరణాల సమర్పణ ornaments



టీటీడీ స్థానిక లయాల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఆభరణాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి రూ.33 లక్షల విలువైన స్వర్ణాభరణాలను బహుకరించారు.


ఈ ఆభరణాలలో శీమ కమలాలు, నవరత్న పూసలతో కూడిన రెండు పేటల బంగారు హారం, బంగారు లక్ష్మీకాసుల మాల ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తరఫున ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ ఆభరణాలను నారాయణవనం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందజేశారు.


అనంతరం మంగళవాద్యాల నడుమ ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి, మూలమూర్తి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Training Program for Fastfood Vendors Commences







With an aim to provide hygienic food to the multitude of visiting pilgrims to Tirumala, all the hoteliers and street food vendors should practice hygienic methods and regularly carry out Food Safety Auditing as per norms, advocated, TTD Additional EO Sri C Venkaiah Chowdary.


The three-day training programme for Street food Vendors jointly organised by TTD health department along with Food Safety and Standards Authority of India (FSSAI) and Nestle India has commenced at the Auditorium of SV Museum in Tirumala on Tuesday for 325 food establishments  employing approximately 1,300 workers in the Hill Town.


Addressing the training program the Additional EO complimented the Nestle India Company for coming forward to give this training to the streetfood vendors on CSR basis. ''They have commenced their training program in AP from Tirumala which is a commendable idea, he reiterated.


The Additional EO said the top priority is the health safety of scores of devotees. ''By enhancing and practicing hygienic food methods will definitely a value addition for the spiritual centre. We are strictly observing hygienic habits in Annaprasadam. The private eateries in Tirumala should also scrupulously follow the hygienic food practices. For every six months the training should be imparted to the hoteliers and street food vendors to enhance awareness among them. The training should also focus on minimum statutory procedures and norms, supplemented with practical exercises to reinforce safe food-handling practices while revisiting the routine activities, he opinioned.


Later the Additional EO also presented the safety kits to the participants that included caps, gloves, aprons, soaps etc.


Deputy EO Health Sri Soman Narayana, Health Officer Dr Sudha Rani, Quality Manager Sri Lakshmi Narayana Reddy,  Corporate Affairs Manager of Nestle India Sri Waseem Ahmed, health department officials, hoteliers, street vendors and others were also present.

TTD TakesComprehensive Steps for Admissions in 33 Education Institutions




TTD JEO (Health & Education) Dr. A. Sarath has directed officials to ensure a smooth, transparent and merit-based admission process for the academic year 2026–27 in all 33 TTD educational institutions.


Reviewing the admission preparations through a Zoom conference from the SVBC office in Alipiri on Tuesday, along with TTD DEO Sri Venkata Sunil, the JEO emphasized that TTD has been giving equal importance to education along with temple administration for over seven decades.


He instructed all institutions to constitute admission committees, establish help desks for students and parents, and conduct admissions strictly on merit with complete transparency and accountability.


Dr. Sarath also directed officials to accept admission fees only through online payment modes, provide proper guidance boards and information centers, and ensure wide publicity for admissions in institutions such as SV School of Sculpture, Balamandir and the School for the Deaf through print, digital and social media platforms.


The meeting was attended by TTD DEO Sri Venkata Sunil, principals of colleges and headmasters of schools through Zoom conference.

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం- టీటీడీ అదనపు ఈవో ttd addl eo







భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో మంగళవారం, టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.


సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం టీటీడీ బాధ్యత అని అన్నారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


ఇప్పటికే తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినప్పటికీ, వాటిని నిరంతరం కొనసాగించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని చెప్పారు. టీటీడీ అన్నప్రసాదంలో నాణ్యమైన ఆహార ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. అదే రీతిలో తిరుమల లోని వివిధ హోటల్స్ కూడా ఉన్నత ఆహార ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు


తిరుమలలో ప్రస్తుతం సుమారు 325 దుకాణాల్లో(street vendors) ఆహార విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటిలో దాదాపు 1,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థల యజమానులు తమ సిబ్బందికి పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.


నెస్లే ఇండియా సంస్థ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి గ్లోవ్స్, ఆప్రాన్, సబ్బులు, టోపీలు తదితర వస్తువులు ఉండే కిట్లను ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. కార్యక్రమం ద్వారా ఆహార విక్రయ కేంద్రాల్లో మరింత పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.


శిక్షణలో ఆహార భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధ నిబంధనలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించి 

ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం, భక్తులకు సురక్షితమైన ఆహారం అందించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు ఈవో తెలిపారు.


కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి, క్వాలిటీ మేనేజర్ శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, FSSAI ప్రతినిధులు, నెస్లే ఇండియా మేనేజర్ వసీమ్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.