25.9.26

తిరుమలలో కన్నులపండువగా భాగ్ సవారి ఉత్సవం bagh savari






 శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.


శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌ సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.


అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.


ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌ సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.


అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు.


ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు.


Tiruchanoor Padmavati Ammavari Brahmotsavams from 5th to 14th December




TTD JEO Dr. A. Sharath directed officials to make comprehensive arrangements for the Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavari at Tiruchanoor from December 5 to 14.


The JEO said the number of devotees is expected to increase by 15–20% compared to last year and instructed all departments to work in coordination.


Special arrangements, including queue lines, barricades, four holding points, LED screens, sign boards, medical camps, security and traffic management, should be made, particularly for Panchami Theertham.


They also directed officials to provide attractive spiritual lighting and ensure a safe, comfortable and devotional experience for devotees.

TTD JEO Inspects Achyutam, Sripatham Development Works






TTD JEO Dr. A. Sharath inspected the ongoing development works at the Achyutam and Sripatham buildings in Tirupati on Thursday, along with officials.


He reviewed the accommodation rooms, dormitories, PAC, room booking facilities, lockers and amenities for Srivari Sevaks. He directed the officials to complete the works within the stipulated time while maintaining quality.


TTD CE Sri Manoharam, SE Sri Venkateswarlu, Deputy EO Sri Selvam, VGO Sri Giridhar and other officials were present.

అచ్యుతం, శ్రీపథం అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి జేఈవో నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలి : జేఈవో డా. ఎ. శరత్ ttd jeo








శ్రీవారి భక్తుల వసతి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలో నిర్మాణంలో ఉన్న అచ్యుతం, శ్రీపథం భవనాల అభివృద్ధి పనులను టిటిడి జేఈవో డా. ఎ. శరత్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.


ఈ సందర్భంగా వసతి గదులు, డార్మిటరీలు, పీఏసీ, గదుల బుకింగ్, లాకర్లు, శ్రీవారి సేవకుల సౌకర్యాలకు సంబంధించిన పనులను జేఈవో పరిశీలించారు. నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి, పలు సూచనలు చేశారు.


ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, వీజీవో శ్రీ గిరిధర తదితర అధికారులు పాల్గొన్నారు.

Padmavati Ammavari Pavitrotsavams Begin Grandly





The Pavitrotsavams at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, began grandly on Thursday with special rituals.


After Suprabhatam and Sahasranamarchana, the processional deities were taken to the Yagashala.


Snapana Tirumanjanam was performed with milk, curd, honey, sandalwood, turmeric, coconut water and  fruits 


TTD JEO Dr. A. Sarat, temple officials, priests and devotees participated.

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు poornahuti


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.


ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.


ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.


సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వి ఆర్ శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం pavitrotsavams





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుండి ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.


మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.


ఈ కార్యక్రమంలో  టిటిడి జేఈవో డా.ఎ.శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్ , ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.