టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు పిండి దీపోత్సవ శోభాయాత్ర మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది.
మనసునుపిండిగా.. జ్ఞానాన్నిజ్యోతిగావెలిగించాలి
పిండి దీపారాధనతో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉందని జేఈవో తెలిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, భక్తులు తమ మనసును పిండిగా, జ్ఞానాన్ని జ్యోతిగా భావించి భగవంతుని ఆరాధించాలని సూచించారు. కురవ నంబి, తొండమాన్ చక్రవర్తి పిండి దీపంతో శ్రీవారిని ఆరాధించిన విశేషాలను వివరించారు.
శాస్త్రోక్తంగాపూజలు
శోభాయాత్రకు ముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో అర్చకులు పిండి దీపానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపాన్ని అలిపిరి పాదాల మండపానికి తీసుకువెళ్లి ప్రతిష్ఠించి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, విజీఓ శ్రీ గిరిధర్, సిఎంవో డాక్టర్ కుసుమ కుమారి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి, దాససాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులతో ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీ ప్రభల గోపినాథ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో నదులను జీవనదాతలుగా, దైవస్వరూపాలుగా భావించి వాటికి పూజలు, హారతులు సమర్పించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని తెలిపారు. నదీ దేవతకు దీపారాధన, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, నదులు పుష్కలంగా ప్రవహించి సమస్త జీవరాశులకు జీవనాధారంగా నిలవాలని ప్రార్థించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
నవంబర్ 16న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గోష్పాద క్షేత్రంలో సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు గోదావరి హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు జేఈవో వెల్లడించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదావరి మాత ఆశీస్సులతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ డా. మేడసాని మోహన్, శ్వేత ఇన్ఛార్జి సంచాలకులు డా. వేమా వేంకట రత్నం, డిపిపి అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి, డిపిపి ఏఈవో శ్రీ సిహెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణకు విరాళం డీడీని అందజేశారు.
Hyderabad-based donor Sri Nomula Ashok Kumar donated Rs.1.02 crore to the SV Pranadana Trust run by TTD.
He handed over the donation to TTD Chairman Sri B.R. Naidu at the TTD Camp Office in Hyderabad on Friday.
The Chairman appreciated the donor and thanked all donors for supporting the services of the SV Pranadana Trust. He wished that the blessings of Sri Venkateswara Swamy would always be upon the donor and his family.
టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో శ్రీవారి దర్శనానికి వచ్చే పవిత్రమైన టీటీడీలో పనిచేయడం మన అదృష్టమని, సేవా భాగ్యమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి మానవతా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని సూచించారు. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింస మార్గాల ద్వారా ప్రజలను ఏకం చేసిన గాంధీజీ, సామాజిక అసమానతల నిర్మూలనకు, అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి సువర్ణమ్మ, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, సీఏవో శ్రీ వేంకటరమణ, శ్వేత ఇన్చార్జి సంచాలకులు డా. వేమా వెంకట రత్నం, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.