11.10.26

అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు brahmotsavams



శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పకవిమానం, అక్టోబరు 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.


వాహన సేవల వివరాలు :


అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు


అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు

పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు

హంస వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు

ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు

సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు

గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు


అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు

పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు

గజ వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు

చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు

అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు


NAVARATRI FESTIVALS AT TIRUCHANOOR FROM OCTOBER 11–20


Navaratri festivals will be held at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor from October 11 to 20.


Snapana Tirumanjanam will be performed daily from 3 PM to 4:30 PM, followed by Unjal Seva.


 On Vijayadasami, October 20, Goddess Padmavathi will bless devotees on the Gaja Vahanam at 7:45 PM.


Arjitha Sevas Cancelled

Kalyanotsavam will remain cancelled throughout the ten-day festival. Lakshmi Puja on October 16 will also be cancelled.

అక్టోబ‌రు 11 నుంచి 20వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు padmavati ammavari temple


తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌రు 11 నుంచి  20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.


ఈ సందర్భంగా ప్రతిరోజూ మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.


అక్టోబరు 20వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు రాత్రి 7.45 గంట‌ల‌కు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.


ఆర్జిత సేవ‌లు ర‌ద్దు


న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వంను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, అక్టోబ‌రు 16న ల‌క్ష్మీపూజ‌ సేవ‌లు రద్ద‌య్యాయి.

ANKURARPANA FOR NAVARATRI BRAHMOTSAVAMS ON OCTOBER 11


Ankurarpanam or Beejavapanam-the festival of prelude for Navahnika Navaratri Brahmotsavams, will be performed on Sunday, October 11.


The rituals includes Senadhipathi Utsavam where in the divine commander in chief, Sri Vishwaksena parades along mada streets surrounding Tirumala temple to supervise the ongoing arrangements for mega religious fete, which is followed by Medini Puja, where the divine mother Earth is being worshipped and finally Ankuraropanam or Ankurarpanam or Beejavapanam.


In this nine seedlings are being sown in nine mud pots-Palikas under the moon light. The germination of these seedlings represents the successful conduct of the Brahmotsavams.