19.10.26

సూర్యప్రభ వాహనసేవలో జాతీయ, అంతర్జాతీయ కళారూపాల వైభవం surya prabha










తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నిర్వహించిన సూర్యప్రభ వాహనసేవలో జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలను ప్రదర్శించడంతో తిరుమాడ వీధులు భక్తిరసంతో, సాంస్కృతిక వైభవంతో శోభిల్లాయి.

దేశవిదేశాల కళారూపాలతో భక్తిభావం

పుదుచ్చేరి కళాకారుల కరగట్టం, పంజాబ్ కళాకారుల భాంగ్రా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు భరతనాట్యంతో అలరించారు. ఖతర్‌కు చెందిన శ్రీమతి సుచిత్ర పూవంచలిల్ బృందం భరతనాట్యం, దుబాయ్‌కు చెందిన శ్రీమతి ప్రీతి బృందం కూచిపూడి నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నాయి.

తెలంగాణ లంబాడీ నృత్యం, కర్ణాటక గజేంద్రమోక్షం నృత్యరూపకం, సిక్కిం మరుణి నృత్యం, మధ్యప్రదేశ్ కథక్, పంజాబ్ భాంగ్రా ప్రదర్శనలు భారతీయ కళా సంప్రదాయాల వైవిధ్యాన్ని చాటిచెప్పాయి.

ఉత్తమ ప్రదర్శనలిచ్చిన కళాబృందాలకు ఈవో సత్కారం

సూర్యప్రభ వాహనసేవలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చిన ఐదు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అభినందించి సత్కరించారు.

1. పుదుచ్చేరి: శ్రీమతి ఎన్. సంగీత బృందం – కరగట్టం.

2. పంజాబ్: శ్రీ హర్దీప్ సింగ్ ఔజ్లా బృందం – భాంగ్రా.

3. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల – భరతనాట్యం.

4. ఖతర్: శ్రీమతి సుచిత్ర పూవంచలిల్ బృందం – భరతనాట్యం.

5. దుబాయ్: శ్రీమతి ప్రీతి బృందం – కూచిపూడి.

14 బృందాలు.. 411 మంది కళాకారుల ప్రదర్శనలు

ఈ వాహనసేవలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టులకు చెందిన మొత్తం 14 కళాబృందాల్లోని 411 మంది కళాకారులు పాల్గొన్నారు.

విభిన్న ప్రాంతాల కళారూపాలు, భక్తిరసభరిత ప్రదర్శనలతో సూర్యప్రభ వాహనసేవకు విశేష శోభ చేకూరింది. సూర్యప్రభ వాహనంపై విరాజిల్లిన శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకుంటూ కళాప్రదర్శనలను తిలకించిన భక్తులు ఆనందభక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఉత్తమ ప్రదర్శనలిచ్చిన కళాబృందాలకు ఈవో సత్కారం best performers










సూర్యప్రభ వాహనసేవలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చిన ఐదు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అభినందించి సత్కరించారు.

1. పుదుచ్చేరి: శ్రీమతి ఎన్. సంగీత బృందం – కరగట్టం.

2. పంజాబ్: శ్రీ హర్దీప్ సింగ్ ఔజ్లా బృందం – భాంగ్రా.

3. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల – భరతనాట్యం.

4. ఖతర్: శ్రీమతి సుచిత్ర పూవంచలిల్ బృందం – భరతనాట్యం.

5. దుబాయ్: శ్రీమతి ప్రీతి బృందం – కూచిపూడి.

DEVOTEES LAUD FLORAL DECORATIONS OF BRAHMOTSAVAMS


Devotees have highly appreciated the floral decorations arranged in Tirumala in connection with the Srivari Brahmotsavams, said TTD Garden Deputy Director Sri Srinivasulu. 


He was speaking at a media conference held at the Media Centre in Rambageecha-2, Tirumala, on Sunday.


He said that around 30 donors came forward to support the floral decorations for the Brahmotsavams. 


With their cooperation, encouragement from senior officials and the dedicated efforts of the Garden Department staff, the floral decorations were arranged in a grand and captivating manner.


Approximately 60 tonnes of flowers, 5 lakh cut flowers and 80,000 seasonal flowers were used for the decorations. 


The fruit-and-flower exhibition arranged at the Kalyana Vedika, 24 concept-based floral displays were created to kindle children’s interest in the Puranas.


He said TTD is contemplating to develop the gardens in Tirumala further with the assistance of Artificial Intelligence in the future. 


Tirumala has 34 gardens, of which 20 are being maintained by donors and 14 by TTD. These gardens would be developed and maintained in a more attractive manner with AI-enabled support, he maintained.