6.9.26

TTD to Conduct E-Auction of Mixed Rice on 8th September




TTD will conduct an e-auction of mixed rice on September 8, received by devotees through the hundi at the Tirumala Srivari Temple and other TTD-affiliated temples.


A total of 20 lots comprising approximately 7,938 kg of mixed rice will be offered in the e-auction.


Interested bidders must pay an EMD of ₹50,000 online through the Konugolu portal by the evening of September 5 to participate in the auction.


For further details, interested persons may contact the TTD Marketing (Auctions) Office, Tirupati, during office hours at 0877-2264429.


Details are also available on the TTD e-procurement portal: www.konugolu.ap.gov.in

సెప్టెంబరు 8న మిక్సిడ్ రైస్ ఈ-వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన బియ్యాన్ని సెప్టెంబరు 8 -వేలం ద్వారా విక్రయించనున్నారు.

ఈ సందర్భంగా మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్ రైస్‌ను ఈ-వేలంలో ఉంచనున్నారు.

ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రంలోపు ఆన్‌లైన్‌లో కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ-వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429.

అలాగే www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవచ్చు.

5.9.26

కాలిఫ్లవర్ కూర | పాతతరం సంప్రదాయ రుచి | Grandma Style Cauliflower Curry


కాలిఫ్లవర్ కూర | పాతతరం సంప్రదాయ రుచి | Grandma Style Cauliflower Curry

https://youtu.be/pPiUmVfPeL0

టీటీడీ స్థానిక ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు local temples






తిరుపతి, తిరుచానూరు, కపిలతీర్థం, నారాయణవనం తదితర టీటీడీ స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి వేడుకలు శుక్రవారం వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్నపన తిరుమంజనం, వీధి ఉత్సవాలు, గోపూజ, గోకులాష్టమి ఆస్థానం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తిరుచానూరులో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం మూలమూర్తులకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు.

సాయంత్రం 6.45 గంటలకు శ్రీకృష్ణ స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.

సెప్టెంబరు 5 ఉట్లోత్సవం:

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం, పురాణ పఠనం, ఆస్థానం నిర్వహించారు.

కపిలతీర్థంలో శ్రీ వేణుగోపాలస్వామివారికి విశేష సేవలు

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి వీధి ఉత్సవం వైభవంగా జరిగింది.

అనంతరం రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.

నారాయణవనంలో భక్తిభావంతో గోకులాష్టమి

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.

సాయంత్రం 5 నుంచి 6.40 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించి, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేపట్టారు.

సెప్టెంబరు 5న: ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

GOKULASTAMI ASTHANAM IN TIRUMALA TEMPLE



On the auspicious occasion of Gokulashtami, under the auspices of the TTD Garden Department, a grand Abhishekam was held to Kaliyamardhana Krishna at Gogarbham Gardens in Tirumala on Friday.


On this occasion, a special abhishekam was rendered to Swamy with milk, curd, honey, coconut water, turmeric and sandal paste.   


After that, Annaprasadam was distributed followed by Utlotsavam wherein youth participated with enthusiasm in breaking the mud pots tied atop log pole.


Devotees enjoyed the celebrations.


Deputy Director of Garden Department Sri Srinivasulu and other staff participated in this program.


In Srivari Temple:


Meanwhile in the evening between 8pm and 9pm Sri Krishna Janmastami Asthanam will be performed inside Bangaru Vakili.


The religious staff and temple officials will take part in this traditional temple court.

తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు gokulastami




తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

కాగా, శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుండి 9గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని వైదికులు నివేదిస్తారు.

శనివారం సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య తిరుమలలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు.

ఈ కార‌ణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ gopooja









గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గోమాత, దూడలకు నూతన వస్త్రాలు, పుష్పమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి హారతి సమర్పించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో గోమాత పాలను స్వయంగా పితికి, పవిత్రమైన ఆ పాలను ఆలయ అర్చకులకు అందించారు. ఆ పాలను శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం చేయడం విశేషంగా జరిగింది.

7 కోట్ల సార్లుఓం నమో వేంకటేశాయజప సమర్పణ

అనంతరం “ఓం నమో వేంకటేశాయ” మహామంత్రాన్ని 7 కోట్ల సార్లు జపించిన జప పుస్తకాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని ఈవో సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపను కోరారు.

గోమాత పూజ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన సంప్రదాయమని, గోమాతలో సమస్త దేవతా స్వరూపాలను దర్శించే గొప్ప ఆధ్యాత్మిక విశ్వాసం మన సంప్రదాయంలో ఉందన్నారు.

గోసంరక్షణ, గోసేవకు టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ గోశాలను మరింత అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో (విద్య, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్, గోశాల డైరెక్టర్ శ్రీ శివకుమార్, విజీవో శ్రీ గిరిధర్, ఇంఛార్జి డిఎల్వో శ్రీ వెంకట సుబ్బానాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.