11.9.26

శాసన పరిశోధనలో సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి కృషి చిరస్మరణీయం – ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి SADU SUBRAMANYA SASTRY




తిరుమల శాసనాలు, అన్నమయ్య సంకీర్తనలను వెలికితీసి, అనువదించి శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి అన్నారు.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో గురువారం జరిగిన సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 45వ వర్ధంతి సభలో ఆయన “సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి పరిశోధనా దీక్ష” అనే అంశంపై ప్రసంగించారు. శ్రీవారి ఆలయ పేష్కారుగా పనిచేస్తూ 1,167 రాగిరేకుల శాసనాలను సేకరించి, అనువదించారని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించిన అనేక రాగిరేకులను వెలికితీసి, వాటిని సమాజానికి అందించడంలో శాస్త్రి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఎస్వీ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు శ్రీ శ్రీనివాసులు రెడ్డి “సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి పరిశోధనా పటిమ” అనే అంశంపై ప్రసంగించారు. ప్రాచీన గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి తెలుగు సాహిత్య పరిశోధనకు విశేష సేవలందించారని, ఆయన పరిశోధనా దృక్పథం నేటి పరిశోధకులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పుష్పాంజలి

సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 45వ వర్ధంతి సందర్భంగా శ్వేత భవనం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.

అనంతరం శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 104వ జయంతి సందర్భంగా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

 సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో జయంతి సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనుమడు హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీ మూర్తి, శ్వేత ఇన్‌చార్జి సంచాలకులు డా. వేమా. వేంకటరత్నం, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. లత, ప్రముఖ సాహితీవేత్త శ్రీ గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్, ఇతర అధికారులు, సాహితీవేత్తలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవోsv museum





శ్రీవారి
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దా రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి గురువారం ఉదయం మ్యూజియంలోని ఏర్పాట్లను రిశీలించారు.

ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని కళాకృతులను భక్తులు పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులు సులభతరంగా ఫీడ్ బ్యాక్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ ఛార్జ్ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, వీజీఓ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

10.9.26

TTD Releases Brahmotsavams Booklet




The 2026 Brahmotsavam booklet containing details of the Salakatla and Navaratri Brahmotsavams at Tirumala was released on Wednesday during the TTD Board meeting held at Annamayya Bhavan in Tirumala.


TTD Chairman Sri B.R. Naidu, E O Sri Muddada Ravichandra and Board Members jointly released the booklet.


The Salakatla Brahmotsavams will be held from September 15 to 23, while the Navaratri Brahmotsavams will be observed from October 12 to 20.


The booklet provides devotees with details of the various vahana sevas, special rituals and important events scheduled during the Brahmotsavams.


Additional EO Sri Ch. Venkayya Chowdary, JEOs Dr. A. Sharath and Sri Prabhala Gopinath, CVSO Sri K.V. Muralikrishna, and other officials were present.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు brahmotsavam arrangements








తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవన్‌లో బుధవారం ఛైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రతో కలిసి ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

ముఖ్యాంశాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నాం. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఈ నెల 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తాం.

సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వ‌ర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రిగారి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం.

అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను

సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

అదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.

భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.

బ్రహ్మోత్సవాల్లో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీ దేశాల నుంచి కళాకారులు పాల్గొననున్నారు.

భక్తుల భద్రతకు 3,000 మంది పోలీసులతో పాటు 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం.

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 3,000 నుంచి 3,300 మంది సిబ్బందిని నియమిస్తున్నాం.

ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మంది భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది గతేడాదితో పోలిస్తే 52 శాతం అదనం.

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పుష్పాలంకరణలు తదితర అన్ని విభాగాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం, సురక్షితమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.

భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీటీడీ, పోలీస్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన, సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా ఉంది.

ఇత‌ర అంశాలు :

తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన భక్తులకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో లైప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆల‌యాల ప‌రిపాల‌నలో టీటీడీ ప్ర‌వేశ పెట్టింది. ఈ పథకం ద్వారా మరణించిన భక్తుని కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.

పదవీ విరమణ పొందిన CPS/NPS పెన్షనర్లు, వారి కుటుంబాలకు OPS/పెన్షనర్లు తరహాలో EHF సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం 

తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభాగాలుగా విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసేందుకు IOCL సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో M/s GPS Renewablesకు అప్పగించేందుకు ఆమోదం తెలిపాం.

శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ వర్కర్ల పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపుతున్నాం.

టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం.

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు నిర్ణయించాం. ఇందుకోసం 3 సంవత్సరాలకు రూ.1.60 కోట్లు మంజూరు చేశాం.

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపాం.

చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేసేందుకు రూ.17.05 కోట్లకు ఆమోదం తెలిపాం.

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును మరో మూడేళ్లపాటు, అంటే 02-11-2026 నుంచి 01-11-2029 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపాం.

ఈ సమావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, బోర్డు సభ్యులు, జేఈవోలు డా.ఎ.శ‌ర‌త్‌, శ్రీ ప్రభల గోపినాథ్‌, సివిఎస్వో శ్రీ కే వి ముర‌ళీకృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.