25.9.26

TTD JEO Inspects Achyutam, Sripatham Development Works






TTD JEO Dr. A. Sharath inspected the ongoing development works at the Achyutam and Sripatham buildings in Tirupati on Thursday, along with officials.


He reviewed the accommodation rooms, dormitories, PAC, room booking facilities, lockers and amenities for Srivari Sevaks. He directed the officials to complete the works within the stipulated time while maintaining quality.


TTD CE Sri Manoharam, SE Sri Venkateswarlu, Deputy EO Sri Selvam, VGO Sri Giridhar and other officials were present.

అచ్యుతం, శ్రీపథం అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి జేఈవో నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలి : జేఈవో డా. ఎ. శరత్ ttd jeo








శ్రీవారి భక్తుల వసతి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలో నిర్మాణంలో ఉన్న అచ్యుతం, శ్రీపథం భవనాల అభివృద్ధి పనులను టిటిడి జేఈవో డా. ఎ. శరత్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.


ఈ సందర్భంగా వసతి గదులు, డార్మిటరీలు, పీఏసీ, గదుల బుకింగ్, లాకర్లు, శ్రీవారి సేవకుల సౌకర్యాలకు సంబంధించిన పనులను జేఈవో పరిశీలించారు. నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి, పలు సూచనలు చేశారు.


ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, వీజీవో శ్రీ గిరిధర తదితర అధికారులు పాల్గొన్నారు.

Padmavati Ammavari Pavitrotsavams Begin Grandly





The Pavitrotsavams at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, began grandly on Thursday with special rituals.


After Suprabhatam and Sahasranamarchana, the processional deities were taken to the Yagashala.


Snapana Tirumanjanam was performed with milk, curd, honey, sandalwood, turmeric, coconut water and  fruits 


TTD JEO Dr. A. Sarat, temple officials, priests and devotees participated.

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు poornahuti


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.


ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.


ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.


సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వి ఆర్ శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం pavitrotsavams





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుండి ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.


మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.


ఈ కార్యక్రమంలో  టిటిడి జేఈవో డా.ఎ.శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్ , ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

డిసెంబర్ 5 నుంచి 14 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు tiruchanoor




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.


అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు


శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జేఈవో ఆదేశించారు. ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో ఆదేశించారు.


పంచమి తీర్థం రోజున భక్తుల కోసం పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  అన్ని ముఖ్యమైన ప్రవేశ పాయింట్ల వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేలా సూచిక బోర్డులు, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.


విద్యుత్ వెలుగుల్లో అమ్మవారి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి


బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టే విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకునేలా, ఆలయ పవిత్రతను ప్రతిబింబించేలా ఉండాలని జేఈవో సూచించారు. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు, మాడ వీధులు, భక్తుల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో సంప్రదాయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలకు ప్రత్యేక కాన్సెప్ట్ రూపొందించి, అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


భక్తుల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం


భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య, వైద్య శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేఈవో సూచించారు.


అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది, మందులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి


భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు.


ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలు, క్యూ లైన్లు, మాడ వీధులు, ప్రధాన రహదారుల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.


సమన్వయంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు


శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించేలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జేఈవో తెలిపారు. అమ్మవారి కృపతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


ఈ సమీక్షలో టీటీడీ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, డీఎఫ్‌వో శ్రీ డి. ఫణికుమార్ నాయుడు, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.