TTD JEO Dr. A. Sharath inspected the ongoing development works at the Achyutam and Sripatham buildings in Tirupati on Thursday, along with officials.
He reviewed the accommodation rooms, dormitories, PAC, room booking facilities, lockers and amenities for Srivari Sevaks. He directed the officials to complete the works within the stipulated time while maintaining quality.
TTD CE Sri Manoharam, SE Sri Venkateswarlu, Deputy EO Sri Selvam, VGO Sri Giridhar and other officials were present.
ఈ సందర్భంగా వసతి గదులు, డార్మిటరీలు, పీఏసీ, గదుల బుకింగ్, లాకర్లు, శ్రీవారి సేవకుల సౌకర్యాలకు సంబంధించిన పనులను జేఈవో పరిశీలించారు. నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, వీజీవో శ్రీ గిరిధర తదితర అధికారులు పాల్గొన్నారు.
ఉదయం 11 నుండిమధ్యాహ్నం 12.30గంటలవరకుస్నపనతిరుమంజనంవేడుకగాజరిగింది. ఇందులోభాగంగాఉత్సవమూర్తులకుపాలు, పెరుగు, తేనె,చందనం, కొబ్బరినీళ్లు, పలురకాలపండ్లరసాలతోఅభిషేకంనిర్వహించారు.
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటలవరకుఉత్సవమూర్తులనుఆలయనాలుగుమాడవీధుల్లోఊరేగింపునిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 9గంటలవరకుఆలయంలోనియాగశాలలోవైదికకార్యక్రమాలు, పూర్ణాహుతితోపవిత్రోత్సవాలుముగియనున్నాయి.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం 8 గంటల నుండి ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో డా.ఎ.శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్ , ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
అమ్మవారిబ్రహ్మోత్సవాలకుపటిష్టఏర్పాట్లు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జేఈవో ఆదేశించారు. ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో ఆదేశించారు.
పంచమి తీర్థం రోజున భక్తుల కోసం పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ముఖ్యమైన ప్రవేశ పాయింట్ల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేలా సూచిక బోర్డులు, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టే విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకునేలా, ఆలయ పవిత్రతను ప్రతిబింబించేలా ఉండాలని జేఈవో సూచించారు. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు, మాడ వీధులు, భక్తుల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో సంప్రదాయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలకు ప్రత్యేక కాన్సెప్ట్ రూపొందించి, అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తులఆరోగ్యానికిప్రత్యేకప్రాధాన్యం
భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య, వైద్య శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేఈవో సూచించారు.
అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది, మందులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భద్రతాఏర్పాట్లుపటిష్టంగాఉండాలి
భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు.
ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలు, క్యూ లైన్లు, మాడ వీధులు, ప్రధాన రహదారుల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
సమన్వయంతోవైభవంగాబ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించేలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జేఈవో తెలిపారు. అమ్మవారి కృపతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో టీటీడీ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, డీఎఫ్వో శ్రీ డి. ఫణికుమార్ నాయుడు, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.