30.9.26

Pavitrotsavams of Sri Prasanna Venkateswara Swamy Vari Temple from 6th to 8th October




Pavithrotsavams will be conducted as per Agama traditions at Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, from October 6 to 8. Ankurarpanam will be performed on the evening of October 5.


The annual Pavithrotsavams are conducted to preserve the sanctity of the temple and to ward off any inadvertent lapses that may occur during the services of pilgrims and staff.


On October 6, Pavitra Pratishtha will be performed, followed by Pavitra Samarpana and Pavitra Homams on October 7. The festivities will conclude on October 8 with Maha Purnahuti and Pavitra Visarjana.


As part of the celebrations, Snapana Tirumanjanam will be performed every morning to the utsava deities of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi.

అక్టోబర్ 06 నుండి 08వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు pavitrotsavams




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబర్ 06 నుండి 08వ తేదీ వరకు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్రోత్సవాలకు అక్టోబర్ 05వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు.


ఆలయ పవిత్రతను పరిరక్షించే పవిత్రోత్సవాలు


యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా నివారించేందుకు ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను  శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.


మూడు రోజుల పాటు విశేష పూజలు


పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన అక్టోబర్ 06న పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజైన అక్టోబర్ 07న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు నిర్వహిస్తారు. చివరి రోజైన అక్టోబర్ 08న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతాయి.


ప్రతిరోజూ స్నపన తిరుమంజనం


పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందవచ్చు.


అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు tirumala




అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.


•  అక్టోబర్ 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•  అక్టోబర్ 12న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

•  అక్టోబర్ 16న శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ

•  అక్టోబర్ 20న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృథం, శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర.

•  అక్టోబర్ 21న బూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

•  అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ.

Break Darshan Cancelled on 1st and 5th October




In view of the expected increase in the pilgrim rush during the Peratasi month and the ensuing holidays, the Tirumala Tirupati Devasthanams (TTD) has decided to cancel VIP Break Darshan (except for protocol VIPs) on Thursday, October 1, and Monday, October 5.


At present, around 80,000 devotees are having darshan of Lord Venkateswara every day. 


In addition, nearly 30,000 devotees arriving on the same day are being accommodated for darshan on the following day. 


This has resulted in longer waiting times for common devotees.


To facilitate quicker darshan for a larger number of common devotees, TTD has taken the decision to cancel VIP Break Darshan on the above dates.


Consequently, recommendation letters for Break Darshan will not be accepted on the preceding days, that is, on Wednesday, September 30, and on Sunday, October 4.


The devotees are requested to take note of the decision by TTD taken in view of the heavy pilgrim rush and extend their cooperation.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు break darshan




తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.


అక్టోబర్ 1వ తేదీ గురువారం, అక్టోబర్ 5వ తేదీ సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది.


ప్రస్తుతం రోజుకు  సుమారు 80  వేలమంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించడం జరుగుతోంది. అయినప్పటికీ  అదే రోజు అదనంగా వచ్చి దర్శనానికి నిరీక్షించే దాదాపు 30 వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయం  మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.


బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు సంబంధించి ముందు రోజు అనగా సెప్టెంబర్ 30వ తేది బుధవారం, అక్టోబర్ 4వ తేది ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.