1.10.26

టీటీడీకి స్టౌవ్ లు విరాళం donation





తమిళనాడు రాష్ట్రానికి చెందిన పుష్కర్ ప్రాపర్టీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృతి వాసన్ తిరుమల శ్రీవారి ఆలయ పోటులో వడల తయారీకి అవసరమైన 4 పెద్ద స్టౌవ్ లను బుధవారం విరాళంగా అందించారు.


ఈ మేరకు దాత తరఫున ఆ సంస్థ ప్రతినిధి శ్రీ మురళీ తిరుమలలోని పిండిమర వద్ద శ్రీవారి ఆలయ పోటు ఏఈవో శ్రీ మునిరత్నం కు స్టౌవ్ లను అందజేశారు.

పదవీ విరమణ ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉండాలి వారి అనుభవాలను భవిష్యత్తు తరాలకు అందించాలి : టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర rtd ttd employees





టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల అనుభవాలు, సేవా స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలవాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆకాంక్షించారు.


తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో బుధవారం 13 మంది పదవీ విరమణ ఉద్యోగులకు సామూహిక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సంఘటనలు, పొందిన అనుభవాలను సహచరులతో పంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.


భక్తులకు మరింత గౌరవంగా సేవలందించాలి


టీటీడీ ఉద్యోగులు శక్తివంచన లేకుండా మరింత బాధ్యత, సహనం, అంకితభావంతో భక్తులకు గౌరవప్రదమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలవాలని ఈవో కోరారు.


పదవీ విరమణ ఉద్యోగుల సేవలకు అభినందనలు


హిందూ ధర్మప్రచార పరిషత్ సెక్రటరీ డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ, శ్రీవారిని ఒక్క క్షణం దర్శించుకోవడమే ఒక యుగాన్ని చూసినట్లని, అలాంటి శ్రీవారిని సంవత్సరాల తరబడి దర్శిస్తూ సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.


దివంగత కళాకారుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా


గత జూలైలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వయోలిన్ కళాకారుడు దివంగత కె. చక్రవర్తి కుటుంబానికి టీటీడీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అందజేశారు. ఆయన సతీమణి శ్రీమతి ఇందిరతో మాట్లాడి కుటుంబ యోగక్షేమాలు, పిల్లల విద్య తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.


పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం


అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు.


అంతకుముందు శ్రీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థినుల కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు డా. ఎ. శరత్, జేఈవో (విద్య, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ ఆనందరాజు, పదవీ విరమణ పొందిన అధికారులు, టీటీడీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. బీమన్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


Special Festivals at Tiruchanoor Temple in October




Several special festivals and religious events will be observed at the temples in Tiruchanur and Appalayagunta during October.


Sri Padmavathi Ammavari Temple, Tiruchanur


On October 2, 9, 23 and 30, Sri Padmavathi Ammavaru will bless devotees in a procession along the Mada Streets at 6 pm on Fridays.


Navaratri celebrations will be held from October 11 to 20.


Sri Balarama Krishna Swamy Temple


Tiruchi processions will be held in the evening on October 2 and 29 on the occasion of Rohini Nakshatram.


Sri Sundararaja Swamy Temple


Sri Sundararaja Swamy will take out a procession on October 24 at 6 pm on the occasion of Uttara Bhadra Nakshatram.


Sri Suryanarayana Swamy Temple


Sri Suryanarayana Swamy will bless devotees in a Tiruchi procession at 5 pm on October 10 on the occasion of Hasta Nakshatram.


Sri Srinivasa Swamy Temple, Tiruchanur


Abhishekam to the Moolavarlu will be performed on October 3, 10, 17, 24 and 31.


Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta


Vastra Alankarana Seva and Abhishekam will be performed at 7 am on October 2, 9, 16, 23 and 30.


Ashtadala Padma Padmaradhana Seva will be held at 8 am on October 6.


Pavithrotsavams will be conducted from October 6 to 8, with Ankurarpanam on October 5.


Ashtottara Shata Kalasabhishekam will be held at 8 am on October 14.


Kalyanotsavam will be conducted at 10.30 am on October 20.


Abhishekam to Sri Prasanna Anjaneya Swamy will be performed on October 4, 11, 18 and 25.