6.10.26

అప్ప‌లాయ‌గుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ appalayagunta




అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబ‌రు 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.


వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబ‌రు 6న‌ పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబ‌రు 7న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబ‌రు 8న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది. ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు.


ఈ సందర్భంగా ప్రతిరోజూ టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వేణుగోపాల్‌, ఆలయ  అర్చకులు శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

PAVITHROTSAVAMS BEGIN AT APPALAYAGUNTA TEMPLE




The three-day annual Pavithrotsavams at Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, will be held from October 6 to 8. The Ankurarpanam was performed as per Agama traditions on Monday evening, along with Mrutsangrahanam and Senadhipati Utsavam.


On October 6, Pavitra Pratishta will be performed, followed by Pavitra Samarpana and Pavitra Homams on October 7. The festivities will conclude with Maha Poornahuthi and Pavitra Visarjana on October 8.


Daily Snapana Tirumanjanam will be performed to the processional deities of Sri Prasanna Venkateswara Swamy with Sridevi and Bhudevi. Harikatha and devotional music programmes will also be conducted.

NAVARATRI BRAHMOTSAVAM ARRANGEMENTS REVIEWED





With a little less than a week to go for the commencement of the Navaratri Brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala, TTD EO Sri M Ravichandra along with the Additional EO Sri Ch Venkaiah Chowdary and other top brass officials reviewed the preparedness of various departments for the same. 


The meeting took place at Annamaiah Bhavan in Tirumala on Monday where District Collector Dr Venkateswar, SP Sri Subbarayudu  besides TTD JEOs Dr Sharath, Sri Gopinath, CVSO Sri Murali Krishna participated.


The EO appreciated the co-ordinated teamwork of all departments of TTD with Police and other district departments towards the successful conduct of the nine-day Salakatla Brahmotsavams that was observed from September 15 to 23 during last month. He called on all the staff to continue the same team spirit during Navaratri Brahmotsavams also.


Earlier, TTD Additional EO explained the EO through the Powerpoint Presentation that from September 14(Ankurarpanam) to September 23, each day on an average over 73,500 devotees were provided darshan of Sri Venkateswara Swamy in a comfortable manner with a perfect planning which attributed towards 60% of the mega religious event. He said with the cancellation of VIP break, Privilege Darshans etc. devotees had a hasslefree and comfortable darshan besides having darshan of Vahana Sevas also. For Navaratri Brahmotsavams also we are contemplating a similar strategy as this time 20% more devotees are expected to take part in brahmotsavams owing to Dusshera Holidays.


Annaprasadam, Sanitation, Srivari Sevaks, Floral Decorations, Electrical Illumination, Medical Services, Cultural Troupes and Paraphernalia, SVBC telecast, Security arrangements by TTD Vigilance and Police etc.have also been discussed in length.

The heads of various departments of TTD, Police and APSRTC officials were also present.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష brahmotsavams





తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివిధ విభాగాల ఏర్పాట్లపై సోమవారం అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులకు అనుకూలంగా, ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం కల్పించేలా పటిష్టమైన ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇందుకు అన్ని విభాగాలు, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం ప్రధాన కారణమని, ఇదే సమన్వయ స్ఫూర్తిని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.


నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో గతంతో పోలిస్తే సుమారు 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఈవో తెలిపారు. ఈ మేరకు పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.


సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించి, ఏ అంశాలు సక్రమంగా అమలయ్యాయి, భక్తులకు ఏ ఏర్పాట్లు మరింత అనుకూలంగా నిలిచాయి, ఎక్కడైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నాయా, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే అంశాలపై చర్చించినట్లు ఈవో తెలిపారు. గుర్తించిన లోటుపాట్లను నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ లాజిస్టిక్స్, అన్నప్రసాదం, వైద్య ఆరోగ్యం, పారిశుధ్యం, రవాణా తదితర అన్ని విభాగాల్లో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.


నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను వీక్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో సూచించారు.


భక్తులందరూ తిరుమలకు విచ్చేసి ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవల్లో పాల్గొని మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీటీడీ ఈవో కోరారు.


ఈ సమావేశంలో అన్నప్రసాదం, పారిశుధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య సేవలు, రవాణా, పుష్పాలంకరణలు, విద్యుత్‌ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, టీటీడీ విజిలెన్స్, పోలీసుల భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.


టీటీడీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పోలీసు, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.