15.10.26

ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు MUTYAPUPANDIRI







తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ధనుర్భంగం (సీతా స్వయంవరం) ఘట్టాన్ని తలపిస్తూ, శ్రీవారు శ్రీరామచంద్ర. మూర్తి, అమ్మవార్లు సీతా లక్ష్మణుల అలంకారంలో దర్శనమివ్వడం విశేష ఆకర్షణగా నిలిచింది. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.


వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోవింద నామస్మరణలతో మాడ వీధులు మార్మోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.


ముత్యాలు చల్లదనం, ప్రశాంతతకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముత్యపుపందిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా విహరించే శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని కలిగిస్తుంది. ఈ దివ్యదర్శనంతో మనశ్శాంతి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.


ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీమతి జానకీ దేవి, శ్రీమతి రంగశ్రీ, శ్రీ నరేష్ కుమార్, జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ గోపినాథ్, సీవీఎస్వో శ్రీ కే.వీ. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం– భక్తులను అలరిస్తున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు DEVOTIONAL EVENTS




శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో బుధ‌వారం తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


 ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీమ‌తి ర‌విప్ర‌భ‌, మరియు శ్రీ నాగేశ్వ‌ర‌రావు బృందం నాదస్వరం, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేద వేద విద్యాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో వేద సందేశం అందించారు. సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు బీజాపూర్‌కు చెందిన శ్రీ‌మ‌తి మాళ‌విక జోషి నామ సంకీర్త‌న‌ నిర్వహించారు.


ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి శ్రీ‌వాణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ‌మ‌తి సంగూత క‌ఖండ‌కి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీమాన్ వంశీకృష్ణ‌ ధార్మికో ఉపన్యాసం ఇచ్చారు.


సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి బుల్లెమ్మ‌ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి మాధ‌వి బృందం హరికథ గానం జరిగింది.


ఈ కార్యక్రమాలను భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి స్వామివారి భక్తిలో మునిగిపోయారు.

NATIONAL FLOK ARTS ADD SPIRITUAL GRANDEUR TO MUTHYAPU PANDIRI VAHANA SEVA-01













 

Strengthened Quality Monitoring in the Preparation of Sri Vari Prasadam





The Tirumala Tirupati Devasthanams has taken a key decision to further strengthen the monitoring of quality standards in the preparation of Srivari prasadam. As part of this initiative, 13 Potu Worker Seniors, who had been awaiting promotions for several years, have been promoted as Potu Supervisors.


Following the Simha Vahana Seva on Wednesday, TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri C.H. Venkayya Chowdary handed over the promotion orders to the employees at the Srivari Temple in Tirumala.


The TTD Chairman, Sri B.R. Naidu, had facilitated a resolution in the TTD Trust Board and submitted proposals to the State Government seeking promotions for the 13 employees who had been serving as Potu Worker Seniors for several years. The State Government approved the proposals and issued the necessary orders, completing the promotion process.


The promoted employees expressed their gratitude to TTD Chairman Sri B.R. Naidu, the Trust Board members, EO Sri Muddada Ravichandra and Additional EO Sri C.H. Venkayya Chowdary. They welcomed the resolution of their long-pending promotion issue.

DEVOTIONAL MUSIC AND DANCE ENRICH NAVARATRI BRAHMOTSAVAMS



Various venues in Tirupati resonated with devotional music, dance and cultural performances on Wednesday as part of Srivari Navaratri Brahmotsavams.

Devotional songs and Annamacharya Sankirtanas at Annamacharya Kalamandiram, the mythological drama Srinivasa Kalyanam at Mahati, and Dolu music and Bharatanatyam at Sri Kodandarama Chandra Pushkarini captivated devotees and art lovers.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తి సంగీత, నృత్య వైభవం culturual events


తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుపతిలోని వివిధ వేదికలపై నిర్వహించిన భక్తి సంగీతం, పౌరాణిక నాటకం, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అన్నమాచార్య కళామందిరంలో భక్తి కీర్తనల ఆలాపన

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎ. కోదండరామయ్య గాత్రంతో, ఆర్. కల్యాణ్ కుమార్ కీబోర్డ్, బి. మంజునాథ్ తబలా సహకారంతో భక్తి కీర్తనలు ఆలపించారు. గణేశ స్తుతి, రామదాసు కీర్తనలు, యోగి నారాయణ యతీంద్రుల తరంగిణి, అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తాయి.

మహతిలో అలరించిన ‘శ్రీనివాస కల్యాణం’

మహతిలో టీటీడీ ఎంప్లాయీస్ అండ్ పిలిగ్రిమ్స్ సర్వీస్ బృందం ప్రదర్శించిన ‘శ్రీనివాస కల్యాణం’ పౌరాణిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నారదుని ఆగమనంతో ప్రారంభమైన ఈ నాటకంలో శ్రీవారి కల్యాణ ఘట్టాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాన్ని ధర్మప్రచార పరిషత్ ఏఈవో శ్రీ చతుర్వేదుల సత్యనారాయణ, సప్తగిరి మాసపత్రిక సీనియర్ ఉపసంపాదకురాలు డాక్టర్ అల్లాడి సంధ్య, సప్తగిరి విశ్రాంత చీఫ్ ఎడిటర్ శ్రీ సి. శైలకుమార్ తదితరులు వీక్షించారు.

కోదండరామచంద్ర పుష్కరిణి వద్ద నృత్య ప్రదర్శనలు

శ్రీ కోదండరామచంద్ర పుష్కరిణి వద్ద టీటీడీ ఎస్వీసీఎండీ ఆధ్వర్యంలో డోలు వాయిద్య, భరతనాట్య ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీ ఎం. బాలాజీ బృందం డోలు, వయోలిన్, తాళం, సన్నాయి వాయిద్యాలతో సంగీత విభావరి అందించింది.

అనంతరం తిరుపతి సంగీత కళాశాలకు చెందిన శ్రీ శరత్ చంద్ర శిష్య బృందం భక్తి గీతాలు, అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ కీర్తనలకు భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ‘నగుమోము గనలేని’, ‘గరుడ గమన’, ‘లక్ష్మీనరసింహస్వామి’, ‘మహాలక్ష్మి’, ‘శ్రీమన్నారాయణ’, ‘ఒకపరి కొకపరి’ తదితర గీతాలకు చేసిన నృత్యాలు విశేషంగా అలరించాయి.

భక్తి.. సంగీతం.. సంప్రదాయ కళల సమ్మేళనం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు భక్తి, సంగీతం, నృత్యకళల సమ్మేళనంగా నిలిచాయి. భక్తి కీర్తనలు, పౌరాణిక ఘట్టాలు, సంప్రదాయ కళారూపాలతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

Extensive Arrangementsfor Tounsure Services at Tirumala




Extensive arrangements have been made to facilitate the smooth conduct of tonsure services for devotees visiting  Tirumala and fulfilling their vows in the form of offering hair, said DyEO Sri Ramakanta Rao.


Addressing the media at Media Centre in Rambagicha-2 at Tirumala on Wednesday, he said that, in addition to the main Kalyanakatta, 11 mini-Kalyanakattas have been operating. 


A total of 1,200 barbers, including 260 women barbers, have been deployed to help devotees fulfil their traditional vows.


Besides, four more Kalyanakattas are also functioning at TTD temples in Tirupati.


Each barber is expected to serve approximately 45 devotees every day.

He said that nearly three lakh devotees offered their hair during the nine-day Srivari Salakatla Brahmotsavams. 


Special services by women barbers have been arranged to ensure convenience for women and young children offering their hair.


Feedback on the conduct of barbers and the facilities provided is being collected from devotees through QR codes, IVRS and Srivari Sevaks at every Kalyanakatta.


Special arrangements have also been made to play Govinda Namas while devotees offer their hair, creating a spiritual and serene atmosphere during the ritual.