ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని యాగశాలకు వేంచేపు చేసి పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మూలవర్లకు, ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేశారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ హరికృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ ధనశేఖర్, శ్రీ ముని కుమార్, ఇతర అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. భక్తులకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
టీటీడీ నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా, సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలలకు వచ్చే రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ మరింత విస్తృతంగా సేవలందించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో (ఆరోగ్యం&విద్య) శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతిలో పని చేసే మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, శ్రీవారి సేవకులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు ఉచితంగా అనుమతించడం జరిగుతుంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
ట్రైల్ రన్ పూర్తైన అనంతరం నవంబర్ 16వ తేది నుండి భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరుగుతుంది. మ్యూజియం ప్రవేశ రుసుము రూ.50 గా నిర్ణయించడమైనది.
The annual Pavitrotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram commenced grandly on Thursday.
Special rituals, including Punyahavachanam, Raksha Bandhanam and Snapana Tirumanjanam, were performed to the processional deities of the Lord and His consorts. Special abhishekam was performed with milk, curd, honey, coconut water, turmeric and sandalwood paste. Pavitra Pratishtha was performed in the evening.
TTD JEO Dr. A. Sharath, Temple Dy. EO Smt. Varalakshmi, temple officials, priests and devotees participated.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, సమాజంలో అర్చకులకు విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. అర్చకత్వం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలకు ధర్మ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను అందించే పవిత్రమైన సేవ అని తెలిపారు. క్రమశిక్షణ, నిష్ఠ, భక్తి, సంప్రదాయాల పట్ల అవగాహనతో అర్చకులు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు. భగవంతుని సన్నిధిలో అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యత ఉందని, అన్ని సామాజిక వర్గాల వారు అర్చకత్వాన్ని స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి మనిషిని మరొకరితో పోలికలేని ప్రత్యేక వ్యక్తిత్వం, విభిన్న లక్షణాలతో సృష్టించడం దైవశక్తి గొప్పతనమని, ప్రతి ఒక్కరూ దైవానుగ్రహానికి అర్హులేనని, భగవంతుని కృపకు పాత్రులు కావాలంటే భక్తి, ధర్మాచరణ, సేవాభావంతో జీవించాలని ఆయన సూచించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇప్పటికే 2 వేల ఆలయాలకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. టీటీడీ అందిస్తున్న ఆర్థిక సహకారం, అర్చక శిక్షణ, ఆలయాల నిర్మాణం తదితర ధార్మిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యం విస్తరిస్తున్నాయని వివరించారు.
ఒక అర్చకుడు తయారైతే ఒక తరానికి ధర్మ సేవకుడు అందించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ మానవాళికి దైవత్వం, ధర్మం, సేవాభావం మార్గదర్శకాలని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శ్రీ చంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామంలో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తూ అర్చకత్వాన్ని స్వీకరించడం అభినందనీయమని జేఈవో ప్రశంసించారు. ఇలాంటి యువత మరింత మంది ముందుకొచ్చి అర్చకత్వాన్ని స్వీకరించడం ద్వారా సనాతన ధర్మ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. టీటీడీ అందిస్తున్న అర్చక శిక్షణను సద్వినియోగం చేసుకుని ధార్మిక సేవలకు అంకితం కావాలని సూచించారు.
అనంతరం 15 రోజుల అర్చక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్చకులకు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలతో పాటు ఇత్తడి పళ్లెం, గంట, హారతి పాత్ర, పలక, రెండు రాగి గ్లాసులు, ఉద్ధరిణి, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే సకల దేవతా కల్యాణ ప్రయోగం, టీటీడీ పంచాంగం, ఆలయ అర్చన – ఆరాధన విధానం తదితర ధార్మిక గ్రంథాలను అందించి, అర్చక సేవలకు అవసరమైన ఆధ్యాత్మిక, పూజా సామగ్రిని అందించారు.
అర్చకసంప్రదాయాలపై 15 రోజులపాటుశిక్షణ
అంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏఈవో శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు, జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపినాథ్ సూచనల మేరకు శ్వేత సహకారంతో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 05 వరకు 15 రోజులపాటు అర్చక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అర్చకులకు అవసరమైన ధార్మిక, సనాతన ధర్మ అంశాలపై శిక్షణ అందించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ తాళ్లూరి విష్ణు, జోనల్ ఇన్చార్జి శ్రీ రెడ్డెప్ప రావు, శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకటరత్నం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.