10.11.26

భక్తులకు ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ సదుపాయం ttd calendars





నూతన సంవత్సరం – 2027ను పురస్కరించుకుని టీటీడీ ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసేందుకు టీటీడీ సదుపాయం కల్పించింది.

భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

అదేవిధంగా, తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 విక్రయ కేంద్రాల్లోనూ ఈ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు.

కాగా, 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 2026 సెప్టెంబరు 7వ తేదీన ఆవిష్కరించగా, అదే రోజు నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి.

కావున, భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలను టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ లేదా  టిటిడి సమాచార కేంద్రాల వద్ద కొనుగోలు చేయాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

9.11.26

DIWALI ASTHANAM PERFORMED AT TTD LOCAL TEMPLES





Diwali Asthanam was performed with religious fervour at Sri Govindarajaswamy and Sri Kodandarama Swamy temples in Tirupati on Sunday.


At both temples, new clothes and lamps were offered to the deities, followed by special rituals as per tradition.


TTD cancelled Sahasra Kalasabhishekam and Hanumantha Vahana Seva at Sri Kodandarama Swamy Temple on account of Amavasya.


The Jeeyar Swamijis, Deputy EOs, temple officials and priests participated in the rituals.

Deepavali Asthanam Held




On the auspicious occasion of Deepavali, the festival of lights, the customary Deepavali Asthanam was observed in Tirumala temple on Sunday.


As part of the celebrations, the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi, and Vishvaksena, were ceremoniously seated at the Garuda Alwar Sannidhi near the Bangaru Vakili. Special pujas were performed to the deities.


Later, new silk vastrams were presented to the presiding deity and the processional deities. 


TTD Specified Authority Chairman and Executive Officer Sri M Ravi Chandra conveyed Deepavali greetings to Srivari devotees present across the globe. 


TTD Additional Executive Officer Sri CH Venkaiah Chowdary, CVSO Sri Murali Krishna have also extended their Diwali wishes.


Both the pontiffs of Tirumala, religious and temple staff were also present.

టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు.. నూతన వస్త్రాలు, దీపాల సమర్పణ deepavali astanam




తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివార్ల ఆలయాల్లో ఆదివారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో..

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి దీపావళి ఆస్థానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలతో దీపావళి ఆస్థానం నిర్వహించారు.

అమావాస్య సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేక సేవ, హనుమంత వాహనసేవను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమాల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం dipavali asthanam




తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది.

ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, దీపావళి పర్వదినాన శ్రీవారి భక్తులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆప్తులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, శ్రీరామనవమి, గోకులాష్టమి సందర్భంగా సంవత్సరానికి నాలుగుసార్లు ఆస్థానం నిర్వహిస్తారని తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వామివారి కృపతో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

8.11.26

Member Takes Oath as TTD Specified Authority Member





Sri K. Kannababu, Secretary to Govt., Revenue (Endowments) Dept., (FAC), took oath as a member of the TTD Specified Authority on Saturday in Srivari Temple.


The oath-taking ceremony was held at the Bangaru Vakili inside the Srivari Temple in Tirumala.


The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary administered the oath. 


Later, Vedic scholars offered Veda Ashirvachanam to Sri K. Kannababu at the Ranganayakula Mandapam and the Additional EO presented him with Srivari Teertha Prasadams.


Speaking to the media in front of the temple on this occasion, Sri K. Kannababu said that he considered the opportunity to serve as a member of the TTD Specified Authority a divine blessing bestowed by Sri Venkateswara, the presiding deity of Kaliyuga. 


He stated that he would strive to uphold the trust reposed in him by Hon'ble Chief Minister Sri N. Chandrababu Naidu, who appointed him as a member of the Specified Authority, and render his services to the best of his ability.


He further stated that under the leadership of the Chairman of the Specified Authority, he would work with utmost devotion and dedication to promote the religious heritage and spiritual significance of the Srivari Temple across the world.


Srivari Temple Dy EO Sri Bhaskar, Board Cell Dy EO Smt. Prashanti and other officials were present.

SV Museum Remains Temporarily Suspended on 8th and 9th November




The trial run of the Sri Venkateswara Museum in Tirumala will remain temporarily suspended on November 8 and 9 to facilitate maintenance works.


The museum will reopen for free visits from November 10 to 15, between 10 AM and 5 PM, for TTD employees and their family members, journalists and their family members, students of TTD educational institutions, other students, and Srivari Sevaks.


The SV Museum will be opened to the general public from November 16. An entry fee of Rs. 50 has been fixed for visitors.