24.6.25

ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష SV Museum




తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఇన్‌చార్జ్) శ్రీ సోమన్ నారాయణ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు ఈవోకు మ్యూజియంలో ప్రస్తుత అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు.

ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. 

భద్రతా పరంగా తీదుకోవలసిన సమగ్ర చర్యలు, ఆధునిక సాంకేతికత ఆధారంగా సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు, గార్డులు, గైడులు,  తదితరాలను ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. 

మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ కోసం ఫీడ్‌బ్యాక్ కియోస్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం ఆయన మ్యూజియం తెరిచే సమయం, టికెట్ ధర, కళాఖండాల సంరక్షణ గది, అధికారిక సెల్ఫీ పాయింట్ తదితర అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. 

నిర్మాణ దశలో ఉన్న అన్ని పనులను నిర్దేశించిన సమయం లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, ఈఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాస్, శ్రీ మనోహర్, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ చంద్రశేఖర్, వీజీఓ శ్రీ సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డా మధుసూదన్, మ్యూజియం క్యూరేటర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments