31.8.25

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో విశేష ఉత్స‌వాలు govindaraja swmay




తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి.

-   సెప్టెంబరు 2న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ
-   సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు పత్రోత్సవాలు
-   సెప్టెంబరు 7న చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఆల‌యం మూత‌.
•  సెప్టెంబరు 12, 19, 29వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
 -   సెప్టెంబరు 14న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
-   సెప్టెంబరు 22న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్వ‌నం ఇవ్వ‌నున్నారు.

No comments :
Write comments