16.8.25

తిరుమలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు Independence Day celebrations











ఆగస్టు 15వ తారీఖున 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని  తిరుమలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టిటిడి ఘనంగా నిర్వహించింది. 


టిటిడి చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో...

తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ‌.ఆర్.నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.

గోకులం విశ్రాంతి భవనంలో....

సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది - తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి

నూతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక, మానవీయ విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీలాంటి సంస్థలపై ఉందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.

గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు‌. వారి స్ఫూర్తితో విలువలతో కూడిన వ్యవస్థలో భాగంగా భక్తులందరికీ నిస్వార్థంగా సేవలందించాలని పిలుపునిచ్చారు.

నూతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక, మానవీయ విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. అందుకనుగుణంగా టీటీడీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి విలువలతో వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు.

ఇటీవల కాలంలో టీటీడీ ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. భక్తుల కోసం నిరంతరాయంగా కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే పని చేస్తూ భక్తుల నుండి మన్ననలు చూరగొనాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు శ్రీ వెంకటయ్య, శ్రీ రాజేంద్ర, సోమన్నారాయణ, వీజీవో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments