31.8.25

సెప్టెంబ‌రు నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు padmavati ammavaru

 




-   సెప్టెంబరు 2న శ్రీపద్మావతీ అమ్మవారి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం
-   సెప్టెంబరు 4న శ్రీపద్మావతీ అమ్మవారి పత్రోత్సవాలకు అంకురార్పణ
-   సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు పత్రోత్సవాలు
-   సెప్టెంబరు 7న చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు ఆల‌యం మూత‌.
-  సెప్టెంబ‌రు 12, 19, 26వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.  
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..
-    సెప్టెంబ‌రు 9న ఉత్తరా భాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు. 
శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ..
-  సెప్టెంబ‌రు 14న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్భంగా  రాత్రి 7 గంట‌ల‌కు పెద్దశేష వాహనంపై స్వామివారు క‌టాక్షించ‌నున్నారు. 
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...
-   సెప్టెంబ‌రు 23న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయం
-    సెప్టెంబ‌రు 6, 13, 20 27వ‌ తేదీలలో శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల‌కు వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.

No comments :
Write comments