21.8.25

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు Pavitrotsavams





కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు బుధ‌వారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి.


ఉదయం 5 గంట‌ల‌కు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మ‌వార్ల‌ మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, గ‌రుడాళ్వారుకు, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రమాలలు సమర్పించారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి.  
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ ర‌వి, టెంపుల్ ఇన్స్ప్‌క్ట‌ర్ శ్రీ సురేష్‌ ఆల‌య అర్చ‌కులు, విశేష షంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments