27.8.25

పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు poornahuti






ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌హాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్టార్చ‌న‌, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో  సూప‌రింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments