చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణ వనం, కార్వేటినగరం , ఒంటిమిట్ట, అమరావతి శ్రీ ఎస్వీ ఆలయం తదితర టిటిడి ఆలయాల తలుపులు మూసివేశారు.
ఆదివారం రాత్రి 9.50 నుండి సోమవారం తెల్లవారు జామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
No comments :
Write comments