20.10.25

దీపావళి ప్రతి ఇంట్లో వెలుగు, ఆనందం నింపాలి – టీటీడీ చైర్మన్ , ఈవో దీపావళి శుభాకాంక్షలు deepavali greetings




తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల జీవితాలలో దీపావళి వెలుగు, సంతోషం నింపాలని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్  ఆకాంక్షించారు. 


శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి, అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని మనస్పూర్తిగా ప్రార్థించారు.

శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం మరియు దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని టిటిడి ఛైర్మన్ కోరారు.

No comments :
Write comments