18.10.25

శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవా స్తం - టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ttd chairman




శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని టిటిడి ఛైర్మెన్  శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి వార్తలు పూర్తి అబద్దమైనవని, ఆధారాలు లేని వార్తలని ఆయన ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టిటిడి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనేలేదని ఆయన స్పష్టం చేశారు.

No comments :
Write comments