తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ కు చెందిన శ్రీ ఎం.సౌమ్య అనే భక్తురాలు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం రూ.కోటి విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో దాతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
No comments :
Write comments