దేవుని
కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
జనవరి 19న ధ్వజారోహణం :
జనవరి 19న సోమవారం ఉదయం 10 నుండి 10.30 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
No comments :
Write comments