23.1.26

ర‌థస‌ప్త‌మికి స‌ర్వం సిద్ధం : టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు radha saptami





శ్రీవారి బ్రహ్మోత్సవాలువైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే జ‌న‌వ‌రి 25 తేది నిర్వ‌హించ‌నున్న రథ సప్తమి వేడుకలను కూడా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు తెలియ‌జేశారు.


తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో ఆయ‌న టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌బోర్డు స‌భ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూశ్రీ‌మ‌తి ప‌న‌బాక ల‌క్ష్మిఅద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రిల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.


 సంద‌ర్భంగా ర‌థ స‌ప్త‌మి విచ్చేయ‌నున్న భ‌క్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్ల‌ను చైర్మ‌న్ వివ‌రించారు.


స‌మావేశంలోని ముఖ్యాంశాలుః


శ్రీవారి ఆలయం


వాహన సేవల వివరాలు 


•  సూర్య ప్రభ వాహనం - ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు


•  చిన్న శేష వాహనం - ఉదయం 9 నుండి 10 గంటల వరకు


•  గరుడ వాహనం - ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 


•  హనుమంత వాహనం - మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు


•  చక్రస్నానం - మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు


•  కల్పవృక్ష వాహనం - సాయంత్రం నుండి 5 గంటల వరకు


•  సర్వభూపాల వాహనం - సాయంత్రం నుండి 7 గంటల వరకు


•  చంద్రప్రభ వాహనం - రాత్రి 8 నుండి 9 గంటల వరకు


•  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  సామాన్య భక్తులకు  అత్యంత ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను   

జనవరి 25  శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లుప్రివిలేజ్ ద‌ర్శ‌నాలుప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు.


•  ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌నే ఉద్దేశంతో తిరుపతిలో జ‌న‌వ‌రి 24 నుండి 26 తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ ర‌ద్దు.


అన్నప్రసాదాలు


•  ర‌థ స‌ప్త‌మి రోజు భ‌క్తుల‌కు పంపిణీ చేసేందుకు 14 ర‌కాల మెనూ త‌యారీగ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ 85 ఫుడ్ కౌంట‌ర్ల ద్వారా ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు అన్న ప్ర‌సాదాలు అందేలా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు.


•  వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలుపానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగం.


విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ


•  1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.


•  భ‌ద్ర‌త‌కు సంబంధించి STANDARD OPERATION PROCEDURE ను అనుస‌రిస్తూ టీటీడీ భ‌ద్ర‌తా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌.


పబ్లిక్ అడ్రెస్ సిస్టం


•  ప‌బ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భ‌క్తులకు అవ‌స‌ర‌మై స‌మాచారాన్ని వివిధ భాష‌ల్లో అంద‌జేత‌.


•  భక్తులు కూడా టీటీడీ ఇచ్చే సూచనలు పాటిస్తూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞ‌ప్తి.


రవాణా


•  గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ 1900 ట్రిప్పులను నడుపగా సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2300 ట్రిప్పులను నడిపేందుకు చర్యలు.


సాంస్కృతిక కార్యక్రమాలు


•  శ్రీవారి వాహ‌న‌సేవ‌ల ఎదుట క‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు.


•  వాహ‌న సేవ‌ల ముందు 56 ర‌కాల క‌ళా రూపాల‌ను 1000 క‌ళాకారులతో ప్ర‌ద‌ర్శ‌న.


పారిశుద్ధ్య సేవలు


•  భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్య సేవలు.


•  గ్యాల‌రీల్లోని వ్యర్థాలను ప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టిఇందుకు అవసరమైన అద‌న‌పు సిబ్బంది ఏర్పాటు.


వైద్య సేవలు


•  భక్తులకు అత్యవసర సేవలందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బందిమందులుఅంబులెన్సు వాహనాలు సిద్ధం.


ఎస్వీబీసీ


•  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా వాహ‌న సేవ‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం.


-రథ సప్తమి సందర్భంగా టీటీడీ కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని భక్తులందరూ సంయమనంతో వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలని విజ్ఞప్తి.


 స‌మావేశంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌సీఈ శ్రీ స‌త్య నారాయ‌ణ‌డిప్యూటీ ఈవోలో శ్రీ లోక‌నాథంశ్రీ రాజేంద్ర‌ఇత‌ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments