25.2.26

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన పుంగనూరు శ్రీ క‌ల్యాణ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి బ్రహ్మోత్సవాలు punganuru temple





అన్నమయ్య జిల్లా పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యా వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 9.50 గం. నుండి 10.45 గం. మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.


ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ  కల్యాణ వేంకటరమణ స్వామి వారిని ముందుగా ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో మేల్కొలిపితదుపరి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు‌గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారుసకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 09.50 నుండి 10.45 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారుఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారుకాగారాత్రి 07.00 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.


బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లురంగోళీలుక్యూలైన్లుబారీకేడ్లుఆలయంమాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌పుష్పాలంకరణలు చేపట్టారుబ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర ప్రసాద్టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తిఆలయ అర్చకులుభక్తులు పాల్గొన్నారు


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


24.02.2026


రాత్రి – పెద్ద‌శేష‌వాహనం


25.02.2026


ఉద‌యం – చిన్న‌శేష‌వాహనం


రాత్రి – హంస వాహనం


26.02.2026

ఉద‌యం – సింహ వాహనం


రాత్రి – ముత్య‌పుపందిరి వాహనం


27.02.2026


ఉద‌యం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం


రాత్రి – హ‌నుమంత వాహనం


28.02.2026


ఉద‌యం – మోహినీ ఉత్స‌వం


రాత్రి – గ‌రుడ వాహ‌నం


01.03.2026


ఉద‌యం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం


రాత్రి – చంద్ర‌ప్ర‌భ‌వాహనం


02.03.2026


ఉద‌యం – క‌ల్యాణోత్స‌వం (ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు)


రాత్రి – గ‌జ వాహ‌నం


03.03.2026


చంద్రగ్రహణం సందర్భంగా ఉద‌యం 09.00 గం. నుండి రాత్రి 07.00 గం. వరకు ఆలయం మూత,


రాత్రి 8.30 గం. నుండి అశ్వ వాహనం


04.03.2026

ఉదయం – రథోత్సవం (ఉద‌యం 9 గం.లకు )

మధ్యాహ్నం - 12.45 గం. నుండి 02.00 గం. వరకు మిధున లగ్నంలో చక్రస్నానం


రాత్రి – ధ్వజావరోహణం.


05.03.2026

ఉద‌యం 10 గంట‌ల‌కు తిరుప్పావ‌డ సేవ‌రాత్రి 7.30 గంట‌ల‌కు శ‌య‌నోత్స‌వం జరుగనుంది.

No comments :
Write comments